Nagarjuna: సారీ చెప్పినా వెనక్కితగ్గని అక్కినేని ఫ్యామిలీ.. మంత్రి కొండా సురేఖకు..

Nagarjuna Legal Notice To Konda Surekha: మంత్రి కొండా సురేఖ కామెంట్స్ హీట్ పుట్టిస్తున్నాయి. ఇటు పొలిటికల్.. అటు సినీ ఇండస్ట్రీలో మంత్రి కామెంట్స్ రచ్చ రాజేస్తుంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 3 Oct 2024 1:31 PM IST
Nagarjuna Legal Notice To Konda Surekha
X

Nagarjuna Legal Notice To Konda Surekha: సారీ చెప్పినా వెనక్కితగ్గని అక్కినేని ఫ్యామిలీ..

Nagarjuna Legal Notice To Konda Surekha: మంత్రి కొండా సురేఖ కామెంట్స్ హీట్ పుట్టిస్తున్నాయి. ఇటు పొలిటికల్.. అటు సినీ ఇండస్ట్రీలో మంత్రి కామెంట్స్ రచ్చ రాజేస్తుంది. సారీ చెప్పినా వెనక్కి తగ్గేదే లేదంటున్నారు అక్కినేని ఫ్యామిలీ. ఆమెకు లీగల్‌ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు అక్కినేని నాగార్జున. తన కుటుంబాన్ని అవమానించేలా మాట్లాడిన సురేఖకు త్వరలో నోటీసులు పంపించనున్నట్లు తెలుస్తున్నది. అంతకు ముందు నాగార్జున సోషల్ మీడియాలో స్పందిస్తూ..

“గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను” అని అన్నారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story