సింగిల్ షెడ్యుల్ లోనే నాగ్ 'బంగార్రాజు'

సింగిల్ షెడ్యుల్ లోనే నాగ్ బంగార్రాజు
x
Highlights

దీనితో అదే సినిమా టైటిల్ తో మరో సినిమాని ప్లాన్ చేశారు నాగార్జున. గత కొద్ది రోజులుగా స్క్రిప్ట్ పరంగా ఆగుతూ వస్తున్న ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలో మొదలు కానుందని తెలుస్తోంది.

అక్కినేని నాగార్జున ద్వీపాత్రాభినయంతో ఆకట్టుకున్న చిత్రం సోగ్గాడే చిన్నినాయనా. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 2015లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా అమాయకుడైన రాము పాత్రలో మరొకవైపు సరదాగా కనిపించే బంగార్రాజు పాత్రలో నాగార్జున నటన అద్భుతమనే చెప్పాలి. ఇక బంగార్రాజు పాత్ర ప్రేక్షకులకి బాగా నచ్చింది.

దీనితో అదే సినిమా టైటిల్ తో మరో సినిమాని ప్లాన్ చేశారు నాగార్జున. గత కొద్ది రోజులుగా స్క్రిప్ట్ పరంగా ఆగుతూ వస్తున్న ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలో మొదలు కానుందని తెలుస్తోంది. సింగిల్ షెడ్యూల్ లోనే ఈ సినిమా షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేయాలనీ నాగార్జున భావిస్తున్నారట. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ కూడా నటించబోతుంది. సినిమాకి సంబంధించిన నటినటులను త్వరలోనే ఎంపిక చేయనున్నారు.

ప్రస్తుతం నాగార్జున వైల్డ్ డాగ్ అనే సినిమాని చేస్తున్నాడు. ఇందులో ఎన్‌ఐఏ పోలీస్‌ ఆఫీసర్‌ విజయ్‌ వర్మగా నాగ్‌ కనిపించనున్నారు. ఉపిరి, మహర్షి చిత్రాలకి కథ అందించిన అహిషోర్‌ సోలోమన్‌ దర్శకత్వంలో ఈ సినిమాని చేస్తున్నాడు నాగ్.. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తుంది. యదార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కుతుంది. దాదాపుగా 70 శాతం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని ధియేటర్ లోనే రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాల తర్వాత ప్రవీణ్ సత్తరు దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు నాగ్.

Show Full Article
Print Article
Next Story
More Stories