Samantha Ruth Prabhu: సమంతను కలవబోతున్న అక్కినేని హీరో

Samantha Ruth Prabhu: సమంతను కలవబోతున్న అక్కినేని హీరో

Arun Chilukuri
Published on: 31 Oct 2022 2:58 PM IST
Akkineni Nagarjuna To Meet Samantha Personally
X

Samantha Ruth Prabhu: సమంతను కలవబోతున్న అక్కినేని హీరో

Samantha Ruth Prabhu: గత కొంతకాలంగా టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఆరోగ్య పరిస్థితి గురించి ఎన్నో పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. వీటన్నిటికీ చెక్ పెడుతూ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో సమంత తాను మ్యోసిటిస్ అనే ఒక వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలిపింది. ప్రస్తుతం తాను చికిత్స పొందుతున్నానని త్వరలోనే కోలుకుంటానని చెప్పుకొచ్చింది సామ్. సమంత పోస్టు కి చాలామంది సెలబ్రిటీలు రియాక్ట్ అయ్యారు. త్వరలోనే అంతా చక్కబడుతుందని చాలామంది సమంత కి ధైర్యం చెప్పారు.

అయితే అక్కినేని కుటుంబం నుంచి మాత్రం కేవలం సుశాంత్ మరియు అక్కినేని అఖిల్ మాత్రమే ఈ పోస్ట్ కి రియాక్ట్ అయ్యారు. నాగచైతన్య మరియు నాగార్జున మాత్రం మౌనం వహించారు. అయితే తాజా సమాచారం ప్రకారం నాగార్జున స్వయంగా సమంతాను కలవడానికి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్యను కలవడానికి సమంత ఇష్టపడుతుందో లేదో తెలియదు కానీ నాగార్జున మాత్రం విడాకులు అయినప్పటికీ సమంత పై ఉండే గౌరవం మరియు అభిమానం తనకి ఎప్పటికీ ఉంటాయని నాగార్జున చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

ఈ నేపథ్యంలోనే సమంత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న నాగార్జున స్వయంగా వెళ్లి ఆమెను కలవాలని ప్రయత్నిస్తున్నారట. మరోవైపు ఎవరు కలిసిన కలవకపోయినా సమంత ఆరోగ్య పరిస్థితి త్వరలోనే మెరుగుపడాలని ప్రార్థిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story