Bangarraju: పట్టాలెక్కనున్న నాగార్జున 'బంగార్రాజు'

Akkineni Nagarjuna says His Upcoming Movie Bangarraju is Ready to Shoot
x

అక్కినేని నాగార్జున (ఫొటో ట్విట్టర్)

Highlights

Bangarraju: అక్కినేని నాగార్జున నటించబోయే బంగార్రాజు సినిమాపై ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చింది.

Bangarraju: అక్కినేని నాగార్జున నటించబోయే బంగార్రాజు సినిమాపై ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చింది. ఈ మేరకు ఆయన అందరి సందేహాలను పటాపంచలు చేస్తూ... సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు తేల్చేశారు.

ఇటీవలే 'వైల్డ్ డాగ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు నాగార్జున. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో నాగార్జున కొంత నిరాశ చెందారు. అయితే ఈ సారి తనకు కలిసిచొచ్చే రోల్.. రొమాంటిక్ పాత్రనే నమ్ముకున్నాడు. గతంలో తీసిన సూపర్ హిట్ మూవీ 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాకు సీక్వల్‌ రానుందని ఎప్పటి నుంచో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ మూవీ 'బంగార్రాజు' గా రానుందని పుకార్లు కూడా వినిపించాయి.

ఈ మేరకు బంగార్రాజు పాత్రను మరలా పోషించేదుకు జెండా ఊపాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాను కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో చేసేందుకు నాగార్జున్ రెడీ అయ్యారు. స్క్రిప్ట్ పై చాలా రోజుల నుంచి పనిచేస్తున్న ఈ డైరెక్టర్... ఎట్టకేలకు స్క్రిప్ట్ పని పూర్తిచేశాడంట. దీంతో జులై రెండో వారంలో బంగార్రాజు సినిమా పట్టాలెక్కనుంది. ఈ మేరకు ఓ ఇంటర్య్వూలో అక్కినేని నాగార్జున వెల్లడించారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఈ సారి సూపర్ హిట్ ఖాయమంటూ ఫుల్ ఖుఫీలో ఉన్నారు.

ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటించనుంది. ఇందులో నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య కూడా భాగం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతిత్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories