Akkineni Nagarjuna CDP : కింగ్ నాగార్జున బర్త్ డే సీడీపిని లాంఛ్ చేసిన అక్కినేని కోడలు!

Akkineni Nagarjuna CDP : అభిమాన హీరోల పుట్టినరోజు వస్తుందంటే చాలు రెండు నెలల ముందే సోషల్ మీడియాలో హంగామా మొదలు పెడుతున్నారు

Krishna
Published on: 24 Aug 2020 12:07 PM IST
Akkineni Nagarjuna CDP :  కింగ్ నాగార్జున బర్త్ డే సీడీపిని లాంఛ్ చేసిన అక్కినేని కోడలు!
X

Akkineni Nagarjuna Birthday CDP

Akkineni Nagarjuna CDP : అభిమాన హీరోల పుట్టినరోజు వస్తుందంటే చాలు రెండు నెలల ముందే సోషల్ మీడియాలో హంగామా మొదలు పెడుతున్నారు అభిమానులు.. హీరోల పుట్టినరోజును ట్రెండ్ చేయడం ఇపుడు ట్రెండ్ అయిపొయింది.. ఇప్పటికే ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ల పుట్టినరోజు వేడుకలకు హవా భారీ స్థాయిలో హంగామా చేశారు అభిమానులు.. ఇక ఈ నెల 29న కింగ్ అక్కినేని నాగార్జున పుట్టినరోజు కావడంతో నాగ్ కోడలు, హీరోయిన్ సమంత తన మామ బర్త్ డే కామన్ డీపీని సోషల్ మీడియాలో లాంఛ్ చేశారు. ప్రస్తుతం ఈ కామన్ డీపీ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. లాంఛ్ చేసినందుకు గాను సమంతకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు నాగ్ ఫ్యాన్స్.. ఈ కామన్ డీపీలో నాగార్జున సినీ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాలను అందులో ఉంచారు.

ఇక హీరోగా నాగార్జున విషయానికొస్తే.. అక్కినేని నాగేశ్వరరావు నట వారుసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.. ఇక ఇండస్ట్రీలొ ఎక్కువ ప్రయోగాలూ చేసింది అంటే నాగార్జున అనే చెప్పాలి.. అరవై దాటినా ఇంకా మన్మధుడుగానే అభిమానులతో పిలిపించుకుంటున్నాడు నాగ్.. తన కొడుకులు ఇద్దరు హీరోలు అయినప్పటికీ వారితో పోటి పడి మరి సినిమాలను చేస్తున్నాడు నాగార్జున.. నాగార్జున అంటే కేవలం ఒక హీరో గానే కాదు సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ గా కూడా ఆయనకి పేరుంది.. ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 తో బిజీగా ఉన్నాడు.. అటు వైల్డ్ డాగ్, బ్రహ్మస్త్ర సినిమాలతో బిజీగా ఉన్నాడు..


Krishna

Krishna

Next Story