Nagarjuna: "ఆ రేట్లు మాకు చాలు" అంటున్న నాగార్జున

Nagarjuna: "సినిమా వేదికపై రాజకీయాలు వద్దు" అంటున్న నాగార్జున

admin1
Updated on: 6 Jan 2022 3:00 PM IST
Akkineni Nagarjuna Bangarraju Movie Release in theaters on January 14th
X

"ఆ రేట్లు మాకు చాలు" అంటున్న నాగార్జున

Nagarjuna: "ఆర్ ఆర్ ఆర్", "రాధేశ్యామ్" వంటి ప్యాన్ ఇండియన్ సినిమాలు వాయిదా పడటంతో చాలా సినిమాలకి థియేటర్లలో సంక్రాంతి బరిలో దిగే అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలో సంక్రాంతి బరిలో దిగనున్న సినిమా "బంగార్రాజు". నాగార్జున హీరోగా రమ్యకృష్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా "సోగ్గాడే చిన్నినాయన" సినిమాకి ప్రీక్వెల్ గా తెరకెక్కనుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 14న థియేటర్లలో విడుదల కాబోతోంది. అయితే కరోనా సంగతి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరలు ఇంకా పెరగలేదు. మరి ఈ నేపథ్యంలో సినిమాని విడుదల చేస్తే ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనే అనుమానాలు లేకపోలేదు.

తాజాగా ఈ విషయంలో నాగార్జున కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినిమా వేదికపై రాజకీయాలు మాట్లాడటం నాకు ఇష్టం లేదు అని అన్న నాగార్జున తన సినిమాకు ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలు చాలని అనటం గమనార్హం. అందుకే టికెట్ ధరలు ఎలా ఉన్నా తమ సినిమా మాత్రం సంక్రాంతి బరిలోనే దిగుతుంది అని కరాఖండిగా చెప్పేశారు నాగార్జున. ఇక మంచి అంచనాల మధ్యన విడుదల కాబోతున్న ఈ సినిమాలో నాగచైతన్య కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. "మనం" తర్వాత అక్కినేని హీరోలు నటిస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

admin1

admin1

Next Story