Bangarraju Movie: ఆఖరి నిమిషంలో రీషూట్ కి వెళ్లిన "బంగార్రాజు"

Bangarraju Movie: రీషూట్ అవనున్న బంగార్రాజు సన్నివేశాలు

admin1
Published on: 6 Jan 2022 11:56 AM IST
Akkineni Nagarjuna and Naga Chaitanyas Bangarraju Movie Scenes Reshoots
X

ఆఖరి నిమిషంలో రీషూట్ కి వెళ్లిన "బంగార్రాజు"

Bangarraju Movie: అసలు అయితే సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సిన సినిమాల్లో నాగార్జున హీరోగా నటిస్తున్న "బంగార్రాజు" కూడా ఒకటి. అయితే ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ వంటి ప్యాన్ ఇండియన్ సినిమాలు సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతుండడంతో "బంగార్రాజు" సంక్రాంతి బరిలో నుండి తప్పుకున్నాడు. కానీ ఇప్పుడు పెరుగుతున్న కరోనా కేసులు కారణంగా ఆర్ ఆర్ ఆర్ మరియు రాధే శ్యామ్ సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధం అయ్యాడు "బంగార్రాజు". కానీ తాజా సమాచారం ప్రకారం దర్శకనిర్మాతలు కొన్ని సన్నివేశాలు ని రీ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

కొన్ని ఫైట్ సన్నివేశాల ను మళ్లీ రీషూట్ చేస్తున్నారట. నాగార్జున స్వయంగా ఈ పోర్షన్ ను రీషూట్ చేస్తే బాగుంటుందని సూచించడంతో చిత్రబృందం మళ్లీ రీషూట్ చేసే పనిలో పడింది. ఈ సన్నివేశాలు అన్నిటినీ షూట్ చేయడానికి కనీసం 3 రోజులు అయినా సమయం పడుతుందట. ఈ లోపు నిర్మాణానంతర పనులను పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. మరోవైపు "సోగ్గాడే చిన్ని నాయన" అనే బ్లాక్బస్టర్ సినిమాకి రీమేక్ గా ప్రిక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. రమ్యకృష్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య కీలక పాత్రలో కనిపించనున్నారు.

admin1

admin1

Next Story