తాత గారి సినిమా తీయబోతున్న అక్కినేని హీరో

తాత గారి సినిమా తీయబోతున్న అక్కినేని హీరో
x
Highlights

ఈమధ్య అక్కినేని నాగ చైతన్య పరిస్థితి ఏమి బాగా లేదనే చెప్పుకోవాలి. చేసిన ప్రతి సినిమా డిజాస్టర్ గా మారుతుండటంతో మార్కెట్ పడిపోయింది. నాగచైతన్య...

ఈమధ్య అక్కినేని నాగ చైతన్య పరిస్థితి ఏమి బాగా లేదనే చెప్పుకోవాలి. చేసిన ప్రతి సినిమా డిజాస్టర్ గా మారుతుండటంతో మార్కెట్ పడిపోయింది. నాగచైతన్య ప్రస్తుతం సమంత తో 'నిన్ను కోరి' ఫేమ్ శివ నిర్మాణ దర్శకత్వంలో 'మజిలీ' సినిమాతో బిజీగా ఉన్నాడు. తరువాత పెళ్లి అయిన తర్వాత సమంత, నాగచైతన్య కలిసి నటిస్తున్న మొట్టమొదటి సినిమా ఇదే కాబట్టి ఈ సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలే ఉన్నాయి. తరువాత విక్టరీ వెంకటేష్ తో 'వెంకీ మామ' అనే మల్టీస్టారర్ సినిమాలో నటించనున్నాడు చై.

తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ లో పాపులర్ స్క్రిప్ట్ రైటర్ ఇప్పుడు నాగచైతన్య కోసం ఒక కథ తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. రాజమౌళి దర్శకత్వం వహించిన దాదాపు చాలా సినిమాలకు స్క్రిప్టు అందించిన విజయేంద్ర ప్రసాద్ ను ఈ మధ్యనే అక్కినేని నాగార్జున స్వయంగా సంప్రదించారట. నాగచైతన్య కోసం అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన దేవదాస్ స్క్రిప్ట్ కు మార్పులు చేయాలని కోరారట. విజయేంద్ర ప్రసాద్ కూడా ఒప్పుకొని 'దేవదాస్' సినిమా కథకు నాగచైతన్య కోసం మెరుగులు దిద్దుతున్నారని సమాచారం. అయితే ఇందులో నిజానిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories