మ్యారేజ్‌ లైఫ్‌ ఓ టెన్షన్‌ అంటున్న అక్కినేని అఖిల్‌

మ్యారేజ్‌ లైఫ్‌ ఓ టెన్షన్‌ అంటున్న అక్కినేని అఖిల్‌
x
Highlights

Most Eligible Bachelor Pre Teaser : అఖిల్ అక్కినేని చేసిన మొదటి మూడు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.. ఇప్పుడు నాలుగో ప్రయత్నంగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అనే సినిమాని చేస్తున్నాడు.

Most Eligible Bachelor Pre Teaser : అఖిల్ అక్కినేని చేసిన మొదటి మూడు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.. ఇప్పుడు నాలుగో ప్రయత్నంగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అనే సినిమాని చేస్తున్నాడు. ఇందులో అఖిల్ సరసన పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని గీతా ఆర్ట్స్ నిర్మిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. దాదాపుగా 70 శాతం కంప్లీట్ అయిన ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

అయితే తాజాగా సినిమా నుంచి ప్రీ టీజ‌ర్ ను విడుద‌ల‌ చేశారు మేకర్స్.. ఇందులో అఖిల్ హర్ష అనే పాత్రలో నటిస్తున్నాడు. ఇక ప్రీ టీజర్ లో అఖిల్ మాట్లాడుతూ.. 'ఒక అబ్బాయి లైఫ్‌లో 50శాతం కెరీర్‌.. 50 శాతం మ్యారేజ్‌ లైఫ్‌. కెరీర్‌ను సూపర్‌గా సెట్‌ చేశా. కానీ, ఈ మ్యారేజ్‌ లైఫే...'అంటూ చెప్పుకొచ్చాడు. ఇక టీజర్ ని అభిమానులతో పంచుకుంటూ కెరీర్‌ విషయంలో హర్ష సూపర్‌ హ్యాపీగా ఉన్నారు. కానీ, మ్యారేజ్‌ లైఫ్‌ విషయంలోనే ఆయన ఎంతో టెన్షన్‌గా ఉన్నారు అంటూ చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. అటు పూర్తి టీజర్ ని అక్టోబర్‌ 25వ తేదీ ఉదయం 11.40 గంటలకు విడుదల చేయనున్నట్లుగ వెల్లడించింది.

ఇక ఈ సినిమా తరవాత స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు అఖిల్.. ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమాకి వక్కంతం వంశీ కథను అందిస్తున్నాడు. సైరా లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత సురేందర్ రెడ్డి నుంచి సినిమా వస్తుండడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. అఖిల్ సరసన రష్మికను హీరోయిన్ గా ఫిక్స్ చేశారట మేకర్స్..



Show Full Article
Print Article
Next Story
More Stories