అఖిల్ తో మహేష్ హీరోయిన్ ?

Rashmika Mandanna With Akkineni Akhil : ఛలో సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది నటి కన్నడ భామ రష్మిక మందన్నా.. ఆ తర్వాత గీత

Krishna
Published on: 13 Sept 2020 10:28 AM IST
అఖిల్ తో మహేష్ హీరోయిన్ ?
X

Akkineni Akhil

Rashmika Mandanna With Akkineni Akhil : ఛలో సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది నటి కన్నడ భామ రష్మిక మందన్నా.. ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో భారీ హిట్ కొట్టి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపొయింది. ఇక ఈ ఏడాది మహేష్ బాబుతో సరిలేరు నీకేవ్వరు, భీష్మ లాంటి హిట్లు కొట్టి తన రేంజ్ ని అమాంతం పెంచేసుకుంది ఈ భామ.. ఏకంగా టాప్ హీరోలతో సినిమాలకి ఫస్ట్ ఛాయస్ గా రష్మికనే ఉంటుంది.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో హీరోయిన్ గా రష్మిక ఎంపిక అవ్వగా, ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా రష్మికనే హీరోయిన్ గా తీసుకుంటున్నారన్న ప్రచారం సాగుతుంది . అయితే తాజాగా అక్కినేని అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అఖిల్ సరసన రష్మికను హీరోయిన్ గా ఫిక్స్ చేశారట మేకర్స్.. ఇది అఖిల్ కి ఐదో సినిమా కాగా, రష్మికకి ఎనమిదో సినిమా..

ఈ సినిమాని సరిలేరు నీకేవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమాకి వక్కంతం వంశీ కథను అందిస్తున్నాడు. సైరా లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత సురేందర్ రెడ్డి నుంచి సినిమా వస్తుండడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకి సంబంధించిన అప్డేట్ లను త్వరలోనే అనౌన్సు చేయనున్నారు.

అటు అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ నిర్మిస్తుంది. ఇందులో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. దాదాపుగా 70 శాతం కంప్లీట్ అయిన ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Krishna

Krishna

Next Story