logo

అఖిల్ వారి కోసం వెయిట్ చేస్తాడా

అఖిల్ వారి కోసం వెయిట్ చేస్తాడా
Highlights

అక్కినేని హీరోగా ప్రేక్షకులకు పరిచయమైన అఖిల్ ఇప్పటికి మూడు సినిమాల్లో నటించినప్పటికీ అందులో ఒక్క సినిమా కూడా...

అక్కినేని హీరోగా ప్రేక్షకులకు పరిచయమైన అఖిల్ ఇప్పటికి మూడు సినిమాల్లో నటించినప్పటికీ అందులో ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఈ మధ్యనే విడుదలైన 'మిస్టర్ మజ్ను' పై ఆశలన్నీ పెట్టుకున్నాడు అఖిల్ కానీ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా ఫ్లాప్ అవడంతో తన కెరీర్ కష్టాల్లో పడింది. ఇక నాలుగవ సినిమా ఎవరితో చేయనున్నాడు అనే విషయంపై బోలెడు వార్తలు బయటకు వస్తున్నాయి. గత కొంతకాలంగా అఖిల్ నాలుగవ చిత్రాన్ని సత్య పినిశెట్టి దర్శకత్వంలో చేయనున్నాడని ప్రచారం సాగింది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని అక్కినేని కాంపౌండ్ కొట్టిపారేసింది.

తాజా సమాచారం ప్రకారం ఈసారి ఒక పెద్ద దర్శకుడితో సినిమా చేయాలని ఆశపడుతున్నాడు అఖిల్. స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తే హిట్ అందుకోవచ్చని దాంతో కెరీర్ గాడిలో పడుతుందని అనుకుంటున్నాడు. అయితే రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వారందరూ ఇప్పటికే వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు. వారితో సినిమా చేయాలంటే ఇంకా చాలా కాలం అఖిల్ వేచి చూడాల్సి ఉంటుంది. వెయిట్ చేయడానికి రెడీగా ఉన్నాసరే ఫ్యాన్స్ మాత్రం సినిమా అంత లేట్ అయితే నిరాశ పడతారు. అందుకే మంచి ప్లాన్ అయినప్పటికీ అఖిల్ తన సినిమాని ఆలస్యం చేయకుండా ఉంటే మంచిది.


లైవ్ టీవి


Share it
Top