ఆకాష్ పూరి తదుపరి సినిమా పై క్లారిటీ

Ruthvik
Published on: 11 Feb 2019 11:39 AM IST
ఆకాష్ పూరి తదుపరి సినిమా పై క్లారిటీ
X

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన 'పైసా వసూల్' సినిమా డిజాస్టర్ తర్వాత డైరెక్టర్ పూరీ జగన్నాథ్ 'మెహబూబా' అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. తన తనయుడైన ఆకాష్ పూరి ని హీరోగా టాలీవుడ్ లో లాంచ్ చేస్తూ పూరి స్వయంగా ఈ సినిమాని నిర్మించాడు కూడా. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. పూర్వజన్మ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా ఫ్లాపయిన తరువాత పూరి జగన్నాథ్ మళ్లీ ఆకాష్ ను హీరోగా పెట్టి ఇంకొక సినిమా తీయనున్నారని వార్తలు బయటకు వచ్చాయి.

అయితే చాలా కాలం తర్వాత ఆకాష్ తదుపరి ప్రాజెక్టు పై క్లారిటీ వచ్చింది. పూరి కనెక్ట్స్ బ్యానర్ ఆకాష్ రెండవ సినిమా అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కనుందని అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా టైటిల్ 'రొమాంటిక్'. టైటిల్ చూస్తేనే ఈ సినిమా ఒక ప్రేమ కథ అని అర్థమవుతుంది ఇక ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే డైలాగులు అందించేది పూరి జగన్నాథ్. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. మరి ఈ సినిమాతో అయినా ఆకాష్ హిట్ అందుకున్నాడో లేదో చూడాలి.

Ruthvik

Ruthvik

Next Story