logo
సినిమా

'సాహో' సెట్స్ లో సందడి చేసిన అతిధి

సాహో సెట్స్ లో సందడి చేసిన అతిధి
X
Highlights

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'సాహో'. చిత్రబృందం ప్రస్తుతం రామోజీ...

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'సాహో'. చిత్రబృందం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటుంది. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న 'సాహో' చిత్రం షూటింగ్ సెట్ లో ఒక అనుకోని అతిథి వచ్చి అందరికి సర్ప్రైజ్ ఇచ్చాడట. అతను ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్. ప్రస్తుతం బాలీవుడ్ సినిమా 'పింక్' తమిళ రీమేక్ లో నటిస్తున్నాడు. షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. షూటింగ్ లో గ్యాప్ రాగా, అజిత్ పక్కనే ప్రభాస్ కూడా 'సాహో' షూటింగ్ లో పక్కనే ఉన్నాడని తెలుసుకుని అక్కడకు వెళ్లాడట.

అజిత్ రాకతో 'సాహో' యూనిట్ మొత్తం ఆశ్చర్యపోయారట. ప్రభాస్ మరియు ఇతర యూనిట్ సభ్యులు అజిత్ తో సెల్ఫీ లు తీసుకున్నారు. అక్కడే అజిత్ చాలా సేపు ప్రభాస్ తో మాట్లాడారట. తమిళంలో అజిత్ చేసిన 'బిల్లా' చిత్రాన్ని తెలుగులో ప్రభాస్ రీమేక్ చేసినప్పటి నుండి వారిమధ్య స్నేహ బంధం పెరుగుతూ వచ్చింది. అందుకే పక్కనే ప్రభాస్ ఉన్నాడు అని తెలియగానే వెంటనే మన 'బాహుబలి' ని పలకరించడానికి వెళ్లాడట. దీనికి సంబంధించి ఫొటోలు ఎప్పుడు చూస్తామా అని నెటిజన్లు ఎదురుచూస్తున్నారు.

Next Story