Valimai Movie: ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ లో మొదటి స్థానంలో అజిత్ సినిమా

admin1
Updated on: 24 Aug 2021 2:01 PM IST
Ajith Kumar Valimai Movie is Most Tweeted Hashtag in India 2021
X

వాలిమై పోస్టర్ (ట్విట్టర్ ఫోటో)

Valimai Movie : తాజాగా ప్రముఖ మైక్రో బ్లాగింగ్ మరియు సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ ఇండియా ఇవాళ అనగా ఆగస్టు 23న గత ఆరు నెలల్లో ట్విట్టర్లో ట్రెండ్ అయిన టాప్ 10 హ్యాష్ ట్యాగ్స్ వివరాలను విడుదల చేసింది. ఇవాళ హ్యాష్ ట్యాగ్స్ డే సందర్భంగా ట్విట్టర్ ఈ జాబితాను విడుదల చేసింది. అందులో మొట్ట మొదటి స్థానం కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తదుపరి సినిమా అయిన "వాలిమై" కు దక్కింది. కాగా విజయ్ హీరోగా నటించి ఈ మధ్యనే సూపర్ హిట్ అయిన "మాస్టర్" చిత్రం ఈ జాబితాలో రెండవ స్థానం గెలుచుకుంది. మరో వైపు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి సినిమా అయిన "సర్కారు వారి పాట" భారీగా ట్రెండ్ అయి మూడవ స్థానాన్ని దక్కించుకుంది.

వారి సినిమాలు మాత్రమే కాక వారి పేర్లు కూడా ట్విట్టర్లో భాగానే ట్రెండ్ అయ్యాయి. #అజిత్ కుమార్ నాలుగవ స్థానాన్ని దక్కించుకోగా #తలపతి65 ఐదవ స్థానం ఆక్రమించింది. #ఐహార్ట్ అవార్డ్స్ ఆరవ స్థానంతో సరిపెట్టుకోగా #రుబీనా దిలైక్ ఏడవ స్థానం పొంది అందరి దృష్టిని ఆకర్షించింది. #bts ఎనిమిదవ స్థానాన్ని ఆక్రమించింది. గత కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న #కోవిడ్19 తొమ్మిదవ స్థానం సేకరించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ చిత్రం #వకీల్ సాబ్ ఈ జాబితాలో పదవ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈ జాబితా ఇంటర్నెట్లో హంగామా చేస్తోంది.

admin1

admin1

Next Story