Ajith: మా నాన్న ఇప్పుడు ఉంటే బాగుండేది.. పద్మ అవార్డుపై అజిత్ స్పందన

Ajith:  మా నాన్న ఇప్పుడు ఉంటే బాగుండేది.. పద్మ అవార్డుపై అజిత్ స్పందన
x
Highlights

Ajith: సినీపరిశ్రమకు చేసిన సేవలకు అజిత్ కుమార్ కు కేంద్రం దేశంలోనే మూడో అత్యున్నత అవార్డుతో గౌరవించింది. పద్మభూషణ్ తో సత్కరించింది. దీనిపై ఆయన ఆనందం...

Ajith: సినీపరిశ్రమకు చేసిన సేవలకు అజిత్ కుమార్ కు కేంద్రం దేశంలోనే మూడో అత్యున్నత అవార్డుతో గౌరవించింది. పద్మభూషణ్ తో సత్కరించింది. దీనిపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా భావోద్వేగ పోస్టు చేశారు.

పద్మభూషన్ పురస్కారానికి నన్ను ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నాను. భారత రాష్ట్రపతి ప్రధానమంత్రికి ధన్యవాదాలు. ఈ గుర్తింపు కేవలం వ్యక్తిగత ప్రశంస మాత్రమే కాదు..ఎంతో మంది సమిష్టి కృషి, మద్దతుకు నిదర్శనమని భవిస్తున్నాను. సినీ పరిశ్రమలో ఎంతోమంది నాకు సహకరించారు. వారందరికీ ధన్యవాదాలు. వారందరి ప్రేరణ, సహకారం మద్దతు కారణంగానే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఎన్నో ఏళ్లుగా రేసింగ్, షూటింగ్ లో నాకు సహకారం అందించిన వారికి కృతజ్ఞతలు. నా కుటుంబం, స్నేహితులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ రోజును చూసేందుకు నా తండ్రి జీవించి ఉంటే ఎంతో బాగుండేదనిపిస్తోంది. నన్ను చూసి ఆయన ఎంతో గర్వపడేవారు. భౌతికంగా మా మధ్య లేకున్నా..నేటికి ఆయన నాతోనే ఉన్నాడని నేను అనుకుంటున్నాను.

25ఏళ్ల నుంచి నా భార్య షాలిని సహకారంతోనే నేను ఇలా ఉన్నాను. నా విజయానికి, నా సంతోషానికి ఆమె ప్రధాన కారణం. చివరగా నా అభిమానుల గురించి చెప్పాలి. మీ అంచంచలమైన ప్రేమ, మద్దతు కారణంగానే నేను అంకిత భావంతో పనిచేస్తున్న. ఈ అవార్డు మీ అందరిది. మీ అందరికీ వినోదాన్ని అందించేందుకు ఇలాగే కష్టపడతాను అంటూ ఆనందం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories