Ajith Kumar: బైక్ పై భారత్-పాకిస్థాన్ బోర్డర్ వరకూ వెళ్లిన అజిత్

Thala Ajith Kumar Visits Wagah Border
x

Ajith Kumar: బైక్ పై భారత్-పాకిస్థాన్ బోర్డర్ వరకూ వెళ్లిన అజిత్

Highlights

Ajith Kumar: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ లాంగ్ డ్రైవ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Ajith Kumar: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ లాంగ్ డ్రైవ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నటుడు కాక ముందే బైక్ రేసర్ అయిన అజిత్ తాజాగా తన క్రూయిజర్ బైక్ పై నార్త్ ఇండియా బైక్ ట్రిప్‌కు వెళ్లారు. అయితే, అజిత్ లాంగ్ డ్రైవ్ ఏకంగా భారత్-పాకిస్థాన్ సరిహద్దు దగ్గర వాఘా వరకు ఉండడం విశేషం. ఇదే సమయంలో బోర్డర్ గేట్ దగ్గర త్రివర్ణ పతాకం చేతబూని ఫొటోలకు పోజులిచ్చారు అజిత్ కుమార్. మరోవైపు ఈ స్టార్‌ హీరోతో సెల్ఫీలు దిగేందుకు భారత జవాన్లు ఉత్సాహం చూపించారు. ఈ సమయంలో అజిత్ అందరికీ ఓపిగ్గా సెల్ఫీలు ఇచ్చారు. అజిత్ బైక్ ట్రిఫ్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories