Bhuj Movie: ఓటీటీలో అజయ్‌దేవ్‌గణ్‌ 'భుజ్'

Bhuj Movie: అజయ్‌దేవ్‌గణ్‌ ఎయిర్‌ఫోర్స్‌ పైలెట్‌గా నటించిన చిత్రం ‘భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది.

Kranthi
Published on: 7 July 2021 10:55 AM IST
Ajay Devgn war Drama Bhuj the Prime of India to Release in OTT Platform on 13th August 2021 | Bhuj Movie Release Date
X

Ajay Devgn Bhuj Movie

Ajay Devgn - Bhuj Movie: అజయ్‌దేవ్‌గణ్‌ ఎయిర్‌ఫోర్స్‌ పైలెట్‌గా నటించిన చిత్రం 'భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా' ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. గతంలోనే ఓటీటీలో విడుదల అని వెల్లడించినా విడుదల తేదీని ప్రకటించలేదు. తాజాగా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ప్రత్యేక వీడియో ద్వారా తెలియజేశారు అజయ్‌దేవ్‌గణ్‌. ''1971లో జరిగిన గొప్ప యుద్ధం 'భుజ్‌'గా ఆగస్టు 13న మీ ముందుకొస్తుంది'అని ట్వీట్‌ చేశారు అజయ్‌.

వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన చిత్రమిది. సంజయ్‌దత్, సోనాక్షి సిన్హా, శరద్‌ ఖేల్‌కర్, యమ్మీ విర్క్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అభిషేక్‌ దుదయా దర్శకత్వం వహించిన ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టి సినిమా థియేటర్స్ ఓపెన్ చేసినప్పటికీ ఈ సినిమా ను ఓటీటీలో విడుదలకే మొగ్గు చూపారు చిత్ర యూనిట్.

Kranthi

Kranthi

Next Story