'ఆర్ ఆర్ ఆర్' లో బాలీవుడ్ హీరో

Ruthvik
Published on: 13 Feb 2019 3:40 PM IST
ఆర్ ఆర్ ఆర్ లో బాలీవుడ్ హీరో
X

గతేడాది డిసెంబర్ లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న మల్టీస్టారర్ సినిమా 'ఆర్ ఆర్ ఆర్' బృందం ప్రస్తుతం రెండవ షూటింగ్ షెడ్యూల్ తో బిజీగా ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్లుగా ఎవరు నటించనున్నారో ఇంకా తెలియాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ఈ సినిమాలో ఒక బాలీవుడ్ నటుడు కనిపించనున్నాడని అతను ఎవరో కాదు అజయ్ దేవగన్ అని సమాచారం. నిజానికి కమల్ హాసన్, శంకర్ 'ఇండియన్ 2' కోసం సంప్రదించగా రాని భాషలో నటించనని చెప్పి ఆఫర్ ను సున్నితంగా రిజెక్ట్ చేశాడు అజయ్.

దీంతో తెలివిగా రాజమౌళి విలన్ పాత్ర కోసం కాకుండా స్పెషల్ కామియో కోసం అజయ్ దేవగన్ ను సంప్రదించాడట. పాత్ర నిడివి తక్కువ కొన్ని నిమిషాలు అయినప్పటికీ, అది కథకు పెద్ద ట్విస్ట్ ఇచ్చే పాత్ర అని తెలుస్తోంది. షూటింగ్ కోసం కేవలం రెండు లేదా మూడు రోజులు కాల్షీట్లు ఇస్తే సరిపోతుందని రాజమౌళి చెప్పగా అతను కూడా ఆలోచనలో పడ్డాడట. పైగా రాజమౌళి 'ఈగ' సినిమాకి హిందీలో డబ్బింగ్ చెప్పింది. అజయ్ దేవగన్. అప్పటి నుంచి వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది కాబట్టి అజయ్ దేవగన్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలో కచ్చితం గా కనిపిస్తాడని బాలీవుడ్ వర్గాల భోగట్టా.

Ruthvik

Ruthvik

Next Story