Aishwarya Rajesh: అలాంటి పాత్రలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా

* ఇకపై అలాంటి సినిమాలు చేయను అంటున్న ఐశ్వర్య రాజేష్

admin1
Updated on: 26 Oct 2021 2:27 PM IST
Aishwarya Rajesh Decided to Act Main Heroine Role Only
X

ఐశ్వర్య రాజేష్ (ఫోటో: ది హన్స్ ఇండియా)

Aishwarya Rajesh: "కౌసల్య కృష్ణమూర్తి" సినిమా తో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైన తమిళ స్టార్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ తెలుగులో "వరల్డ్ ఫేమస్ లవర్", "టక్ జగదీష్" వంటి సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించినప్పటికీ మెయిన్ హీరోయిన్గా మాత్రం ఈమెకు అవకాశాలు రావటం లేదు. "రిపబ్లిక్" సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన హీరోయిన్ గా కనిపించినప్పటికీ, ఈ సినిమాలో ఆమె పాత్ర కి పెద్దగా ప్రాధాన్యత లేదు. ఇక టాలీవుడ్ లో ఐశ్వర్య రాజేష్ కి మంచి బ్రేక్ దొరకలేదని చెప్పుకోవాలి. అయినప్పటికీ తమిళంలో మాత్రం ఐశ్వర్యా రాజేష్ కి వరుస ఆఫర్లు వస్తున్నాయి.

కోలీవుడ్ స్టార్ హీరో అయినా సూర్య నిర్మిస్తున్న కొత్త సినిమాలో ఐశ్వర్య రాజేష్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు దర్శక నిర్మాతలు. బాలా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ మెయిన్ హీరోయిన్ గా కనిపించనుంది. గెస్ట్ పాత్రలో సూర్య కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నాడట. అయితే ఐశ్వర్య రాజేష్ ఇకపై తెలుగులో కూడా హీరోయిన్ పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఐశ్వర్య రాజేష్ తెలుగులో ఇకపై చిన్న పాత్రలు చేయను అని చెప్పుకొచ్చింది.

admin1

admin1

Next Story