Aishwarya Rai: సత్యసాయి సూచించిన ఐదు విధానాలు పాటిస్తా

Aishwarya Rai: సత్యసాయి బాబా చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేనని ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ అన్నారు.

Arun Chilukuri
Published on: 19 Nov 2025 3:58 PM IST
Aishwarya Rai: సత్యసాయి సూచించిన ఐదు విధానాలు పాటిస్తా
X

Aishwarya Rai: సత్యసాయి సూచించిన ఐదు విధానాలు పాటిస్తా 

Aishwarya Rai: సత్యసాయి బాబా చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేనని ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ అన్నారు. పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో సినీ నటి ఐశ్వర్యారాయ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ప్రజలకు సత్యసాయి చేసిన సేవలను గుర్తుచేశారు.

సత్యసాయి బాబా సూచించిన ఐదు విధానాలు తాను ఇప్పటికీ పాటిస్తానని చెప్పారు. సత్యసాయి బాబాది ప్రేమ మతం, మనవతా జాతి, మానవత్వమే జాతి, ప్రేమ మతం, హృదయమే భాష, దేవుడు సర్వవ్యాప్తుడు అని బాబా చెబుతుండే వారని తెలిపారు. ఈ విధానాన్ని అందరూ పాటించాలని ఐశ్వర్యరాయ్ బచ్చన్ సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story