Aishwarya Dhanush: డైరెక్ట్ తెలుగు సినిమా చేయబోతున్న రజనీకాంత్ కూతురు

* టాలీవుడ్ పై కన్నేసిన కోలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య ధనుష్

admin1
Updated on: 6 Oct 2021 6:00 PM IST
Aishwarya Dhanush Planning to Direct in Telugu Language Movie
X

డైరెక్ట్ తెలుగు సినిమా చేయబోతున్న రజనీకాంత్ కూతురు (ట్విట్టర్ ఫోటో)

Aishwarya Dhanush: "బాహుబలి" సినిమా తర్వాత అన్ని భాషల ప్రేక్షకుల కన్ను తెలుగు ఇండస్ట్రీ పైన పడింది అనడం అతిశయోక్తి కాదు. ఇప్పటికే టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ఉన్న విజయ్, ధనుష్ వంటి వారు తెలుగులో డైరెక్టుగా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఒక ప్రముఖ కోలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ తెలుగులో డైరెక్ట్ సినిమా నిర్మించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కత్తి, రోబో 2.0, కాప్పన్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఇప్పుడు తెలుగులో ఒక సినిమాని నిర్మించడానికి సిద్ధమైంది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ భార్య ఐశ్వర్య ధనుష్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారు. ఒకవైపు టాలీవుడ్ లో స్టార్ హీరో అయిన ధనుష్ డైరెక్ట్ తెలుగు సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మరోవైపు ధనుష్ భార్య ఐశ్వర్య కూడా తెలుగులో డైరెక్ట్ సినిమా కి దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఐశ్వర్య ధనుష్ ఇప్పటికే "3", "వై రాజా వై" వంటి సినిమాలకి దర్శకత్వం వహించారు. ఆమె డైరెక్ట్ తెలుగు సినిమా ఎలా ఉండబోతోందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

admin1

admin1

Next Story