Ram Gopal Varma: మళ్లీ రూటు మార్చిన రాంగోపాల్ వర్మ

Ram Gopal Varma: మళ్లీ హారర్ సినిమాల జోలికి వెళ్ళనున్న రాంగోపాల్ వర్మ

admin1
Published on: 27 Nov 2021 12:12 PM IST
Again Ram Gopal Varma Going to do the Horror Movies
X

తులసి తీర్థం సీక్వెల్ తీయనున్న రాంగోపాల్ వర్మ (ఫైల్ ఇమేజ్)

Ram Gopal Varma: ఒకప్పుడు రాంగోపాల్ వర్మ పేరు వింటేనే హారర్ సినిమాలు గుర్తొచ్చేవి. ఒళ్ళు గగుర్పొడిచే హారర్ సినిమాలు తీయడంలో రామ్ గోపాల్ వర్మ పెట్టింది పేరు. హారర్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ అని చెప్పుకోవచ్చు. కానీ గత కొంత కాలంగా రామ్ గోపాల్ వర్మ ఈ జోనర్ లో సినిమాలు తీసింది లేదు. ఈమధ్య బయోపిక్ ల మీద ఆసక్తి చూపిస్తున్న రామ్ గోపాల్ వర్మ తాజాగా మళ్లీ రూటు మార్చినట్లు తెలుస్తోంది. మళ్లీ ఒక హారర్ సినిమా తీయాలని రాంగోపాల్ వర్మ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో అభిమానులు కూడా ఆర్జివి డైరెక్షన్ లో హార్రర్ సినిమా చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం రైటర్ యండమూరి వీరేంద్రనాథ్ తులసీదళం కాన్సెప్ట్ కి సీక్వెల్ తీయాలని రామ్ గోపాల్ వర్మ నిర్ణయించుకున్నారు. తులసి తీర్థం అనే టైటిల్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాని ఈ మధ్యనే తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు రాంగోపాల్ వర్మ. "నా తదుపరి సినిమా "తులసి తీర్థం" యండమూరి వీరేంద్రనాథ్ రాసిన తులసిదళం నవల కి ఒక సీక్వెల్ గా ఉండబోతోంది. భీమవరం టాకీస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు" అని తెలియజేశారు రాంగోపాల్ వర్మ. రామసత్యనారాయణ ఈ చిత్ర నిర్మాత.

admin1

admin1

Next Story