Venkatesh: పాతికేళ్ల తర్వాత హిందీ సినిమాలో అడుగు పెట్టబోతున్న వెంకటేష్

Venkatesh: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సినిమాలో వెంకటేష్ కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది.

admin1
Published on: 10 Dec 2021 3:05 PM IST
After 25 years Venkatesh is Going to Act in Bollywood Movies | Tollywood Latest News
X

పాతికేళ్ల తర్వాత హిందీ సినిమాలో అడుగు పెట్టబోతున్న వెంకటేష్(ఫైల్-ఫోటో)

Venkatesh: గత కొంతకాలంగా విక్టరీ వెంకటేష్ రీమేక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈమధ్యనే తమిళంలో సూపర్ హిట్ అయిన "అసురన్" సినిమానీ తెలుగులో "నారప్ప" అనే టైటిల్ తో రీమేక్ చేసిన వెంకటేష్ ఈ మధ్యనే మలయాళంలో హిట్టయిన "దృశ్యం 2" ను తెలుగులో కూడా విడుదల చేశారు.

అయితే తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ ఇప్పుడు ఒక హిందీ సినిమాకి ఓకే చెప్పినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా సాజిద్ నదియాడ్వాలా నిర్మించనున్న ఒక సినిమాలో వెంకటేష్ కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ మధ్యనే తన తదుపరి సినిమా "అంతిం" ప్రమోషన్స్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన సల్మాన్ ఖాన్ వెంకటేష్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. అయితే ఈ సినిమా గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. మరోవైపు గతంలో వెంకటేష్ హిందీలో అనారి 1993, తకదీర్ వాలా 1995, వంటి సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

కానీ గత కొంత కాలంగా బాలీవుడ్ కి దూరంగా ఉంటున్న వెంకటేష్ మళ్లీ ఒక హిందీ సినిమా ఒప్పుకోవడం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాకి ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది.

admin1

admin1

Next Story