బిగ్‌బాస్ కేసులో నలుగురికి ముందస్తు బెయిల్

బిగ్‌బాస్ కేసులో నలుగురికి ముందస్తు బెయిల్
x
Highlights

♦ బిగ్ బాస్ లో క్యాస్టింగ్ కౌచ్ పై ఆరోపణలు ♦ కార్యక్రమ నిర్వాహకుల పై కేసు పెట్టిన యాంకర్ శ్వేతా రెడ్డి ♦ నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరు...


బిగ్ బాస్ లో క్యాస్టింగ్ కౌచ్ పై ఆరోపణలు

కార్యక్రమ నిర్వాహకుల పై కేసు పెట్టిన యాంకర్ శ్వేతా రెడ్డి

నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్ట్

బిగ్‌బాస్ సీజన్ 3 తెలుగు రియాల్టీ షో నిర్వహణలో నిర్వాహకులు కాస్టింగ్ కౌచ్ ని ప్రోత్సహిస్తున్నారంటూ యాంకర్ శ్వేతారెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో నిందితులుగా పేర్కొన్న నలుగురికి ముందస్తు బెయిల్ మంజూరయింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో బిగ్‌బాస్ ప్రోగ్రాం ఇంచార్జ్ శ్యాం, రవికాంత్‌, రఘు, శశికాంత్‌ లపై కేసు రిజిస్తరైన విషయం తెలిసిందే.

ఈ కేసు విషయంలో పోలీసుల విచారణకు హాజరు కాకుండా ఉన్న నిందితులు, నిన్న నాంపల్లి కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. తమపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, పోలీసుల విచారణకు సహకరిస్తామనీ ఈ సందర్భంగా వారు కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కాగా, ఈ కేసులో స్టార్ మా చానెల్ ఎడ్మిన్ హెడ్ కు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం విదితమే.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories