పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన అడవిశేష్

Ruthvik
Published on: 20 Feb 2019 12:31 PM IST
పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన అడవిశేష్
X

ఒకవైపు సినిమాల్లో హీరో గానే కాక స్క్రిప్ట్ రైటర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అడివిశేష్. ఈ మధ్యనే 'గూడచారి' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అడవిశేష్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో కొన్ని పుకార్లు బయటకు వచ్చాయి. 'గూడచారి' సినిమా లో ప్రముఖ నటి, నాగార్జున మేనకోడలు సుప్రియ నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సుప్రియ మరియు అడివిశేష్ పెళ్లి చేసుకోబోతున్నారని, వారి పెళ్లి సమంత దగ్గరుండి జరిపించబోతుందని వదంతులు వచ్చాయి.

వాటిపై ఈ మధ్యనే వాటిపై సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చాడు అడవిశేష్. "నా జీవితంలో ప్రస్తుతం సినిమాలు తప్ప ఇంకేమి లేవు. యాక్టింగ్‌, రైటింగ్‌.. ఇలా నా కలలను నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్నాను. తలదించుకుని నా పని నేను చేసుకుపోతున్నాను. కష్టపడుతున్నాను. నన్ను నేను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. అంతకుమించి ఏమీ లేదు. ఇట్లు మీ శేష్' అని ట్వీట్ చేశాడు. ఇక 'గూడచారి' సినిమాకు సీక్వెల్ పనిలో బిజీగా ఉన్న అడవిశేష్ హిందీ సినిమా '2 స్టేట్స్' రీమేక్లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.



Ruthvik

Ruthvik

Next Story