
aditiroahydari
Mahasamudram Movie : RX 100 లాంటి భారీ హిట్ తర్వాత దర్శకుడు అజయ్ భూపతి 'మహాసముద్రం' అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది.
Mahasamudram Movie : RX 100 లాంటి భారీ హిట్ తర్వాత దర్శకుడు అజయ్ భూపతి 'మహాసముద్రం' అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది. ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ లు హీరోలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఒక హీరోయిన్ ను ఎంపిక చేసింది చిత్రబృందం.. ఈ సినిమాలో సమ్మోహనం బ్యూటి అదితి రావు హైదరీ హీరోయిన్ గా ఎంపికైంది. గాలిని మోసుకొచ్చే అలలా అదితిరావు హైదరీ మా టీమ్ లో జాయినవుతోంది... ఆమెకు స్వాగతం అంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. ఇందులో ఆమె శర్వానంద్ సరసన నటించనుంది.. ఇటివలే నాని హీరోగా వచ్చిన వి చిత్రంలో హీరోయిన్ గా నటించి మెప్పించింది ఈ అమ్మడు..
ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ గా ఐశ్వర్య రాజేశ్ ను అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన క్లారిటీ రావాల్సి ఉంది.. లవ్, యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళంలో చిత్రీకరిస్తున్నారు. ఇక ముందుగా ఈ సినిమాని రవితేజతో చేయాలనీ అనుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి.. కానీ ఏమైందో తెలియదు కానీ అక్కడి నుంచి కథ శర్వానంద్‌కి వెళ్ళింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి.. వచ్చే ఏడాది సినిమాని రిలీజ్ చేయనున్నారు.
Welcoming the Fantastic Performer who perfectly fits into the lead role of my film, Princess @aditiraohydari on board 🙏😇
— Ajay Bhupathi (@DirAjayBhupathi) October 12, 2020
I'm so fortunate to have so perfect cast in our #MahaSamudram 🌊@ImSharwanand @Actor_Siddharth @AnilSunkara1 @AKentsOfficial pic.twitter.com/5fd3AWdksa

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




