అదిరింది ఆగిపోతుందా? మరి నాగబాబు పరిస్థితి..

అదిరింది ఆగిపోతుందా? మరి నాగబాబు పరిస్థితి..
x
Highlights

ఒక్కొసారి ఆవేశంతోటో ఆసక్తితోనో అనుకోకుండానో, తీసుకునే నిర్ణయం ఎదురు తిరగడం చాలా సహజం. ఒక్కో ఆలోచన తమనుపై మెట్టు ఎక్కిస్తుదనో తమకు ఉన్న బలాన్ని మరింత పెంచుతుందనో అనుకోవడం మానవ నైజం.

ఒక్కొసారి ఆవేశంతోటో ఆసక్తితోనో అనుకోకుండానో, తీసుకునే నిర్ణయం ఎదురు తిరగడం చాలా సహజం. ఒక్కో ఆలోచన తమనుపై మెట్టు ఎక్కిస్తుదనో తమకు ఉన్న బలాన్ని మరింత పెంచుతుందనో అనుకోవడం మానవ నైజం. అదే విధంగా తామున్న స్థానం తమ గొప్పతనమే తమకు ఆ స్థానాన్ని ఇచ్చిన పునాది తమ వల్లనే వెలుగుతోందని భ్రమలో పడిపోవడం అత్యంత సహజమైన విషయం ముఖ్యంగా సెబ్రిటీల విషయంలో.. వినోద పరిశ్రమకు చెందిన మనషుల్లో ఎక్కవగా కనిపిస్తుంది. అందుకు తాజా ఉదాహరణే జబర్థస్త్ నాగబాబు అదిరింది నాగబాబుగా మరాలని చేసిన ప్రయత్నం..

కామెడీ షోల కింగ్ జబర్థస్త్..

ఈ టీవీ వినోదాల విందులో అగ్రతాబులం దక్కించుకున్న కార్యక్రమం జబర్ధస్త్. ఏడేళ్ల క్రితం ఈ కార్యక్రమం ప్రారంభంలో ఎవరికి అంచనాలు లేవు. అంత వరకు టీవీల్లో కామెడీ షోలు పాత సినీమాల్లో హాస్య నటులు చేసిన కదంబంగా కూర్చి వాటిని గంటలో ఆర్థగంటో ప్రదర్శించిచడమే.. ఆ సమయంలో ఉత్తరాధి చానల్స్ ప్రయోగాలు విజయవంతం అయ్యాయి. వాటిలోని సారాన్ని తెలుగు టీవీ సిసాలో నింపి వీక్షకులకు వినోదాల మత్తును పరిచయం చేసింది జబర్దస్త్. అయితే స్టేజ్ ఆర్టిస్టులుగానో చిన్న పాత్రల కోసం సినీ స్టూడియోల చూట్టు తిరిగే కొంత మంది కళాకారులకు జబర్ధస్త్ తమ టాలెంట్ నిరుపించుకునే అవకాశం కల్పించింది. అలాగే ఇటు వీక్షకులకు కూడా కామెడీ స్కీట్లు వినూత్నంగా కనిపించి జబర్థస్త్ ను ఆదరించారు. ఇక్కడ జబర్థస్త్ కార్యక్రమంలో వినోదానికి ఎలాంటి ప్రధాన్యత దక్కిందో.. వ్యాఖ్యాతలకు న్యాయనిర్ణేతలకు దక్కింది. ఇక నిండైన చీర కట్టుకునే యాంకరింగ్‌ను ఆధునిక హంగులు నిప్పుకున్న రసమయ ప్రక్రియగా మార్చేసిందే జబర్థస్త్.

ఈ క్రమంలో మొదట్లో వారానికి ఒక రోజు మాత్రమే ప్రసారం అయినా జబర్థస్త్.. "ఎక్సట్రా కామెడీ"ని "ఎక్సట్రా మత్తుని" నింపుకొని జడ్జీల నవ్వులను రూపొందించుకొని మరింత "ఎక్సట్రా జబర్థస్త్" గా ముందుకు వచ్చింది. ఏడేళ్ల ప్రస్థానంలో రష్మీ, అనసూయ, తన పాపులార్టీని విపరీతంగా పెంచుకోగలిగారు. చమక్ చంద్ర, సుడిగాలి సుధీర్, వేణు వండర్స్, అదిరే అభి, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, హైపర్ ఆది, షకలక శంకర్, ఇటు వంటి వారు ప్రతి తెలుగు ఇంటిని తమ కామెడీతో అలరించారు. తర్వాత వెండి తెరపై కూడా మెరుస్తూ.. తమ టాలెంట్ ను పెంచుకున్నారు. ఇప్పుడు ఇక జబర్థస్త్ జడ్జీల ప్రస్థానం అయితే ఒక విచిత్రమైన ఒరవడిని సృష్టించిందనే చెప్పాలి. అందులోనూ రాజకీయంగా విభిన్న దృవాలైనా రోజా, నాగబాబు ఇద్దరు ఒకే వేదికపై నవ్వుతూ కనిపించే సన్నివేశాల్ని టీవీ వీక్షకులు బాగా ఆదరించారు. దీంతో ఈ మూడు విభాగాల్లో కూడా ఆఆ వ్యక్తుల వల్ల జబర్థస్థ్ కు మెరుపులు దక్కాయో, జబర్థస్త్ అనే వేదిక వల్ల వెలుగులు పంచారో, అనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి.

జబర్థస్త్ మించిపోవాలని..

మిగిలిన చానల్స్ కూడా కార్యక్రమం చేయాలని వినోదాల విందును వడ్డించాలని, టీఆర్పీ రేటింగ్ కోసం విశ్వప్రయత్నాలు చేశాయి. అయితే దాదాపు అన్ని కార్యక్రమాలు బోల్తాపడ్డాయి. ప్రతీసారి జబర్థస్త్ పోటీగా కొత్త కార్యక్రమం ప్రారంభంకావడం, కొన్ని ఆసక్తి రేకెత్తించడం, తరువాత పేర్లు కూడా గుర్తించుకోలేని విధంగా గాలిలో కలిసిపోయాయి. కొత్త కార్యక్రమం ప్రారంభం అయినా ప్రతిసారి జబర్థస్త్ నిర్వాహకులు మరింత బలంగా ఈ కార్యక్రమం నిలబెట్టుకోవడానికి మరిన్ని ప్రయత్నాలు చేశారు. పోటీ వస్తుందనుకున్న కార్యక్రమం వస్తుదనుకున్న కార్యక్రమం వేళలో జబర్థస్త్ ప్రత్యేకత చాటుకుంది. తెలుగు టెలివిజన్ రంగంలో కామెడీని అందించగలం అని జబర్థస్ వారు ప్రేక్షకులకు చెప్పగలిగారు. దాంతో సిరీయల్స్ , గేమ్ షోల విషయంలో ఈటీవీకి ఎదురు లేకుండా పోయింది. ఇటీవల తెర వెనుక ఏం జరిగిందో పక్కన పెడితే.. జబర్థస్త్ షో నుంచి నాగబాబు పక్కకు తప్పుకన్నారు. ఆయన తోపాటు కొంతమంది జబర్థస్గ్ కామెడీయన్లు వేరు కుంపటిని జీ తెలుగు చానల్లో అదిరింది పేరుతో పెట్టుకున్నారు. తాజా టీఆర్పీ రేటింగుల ప్రకారం ఈ అదిరింది షో నిర్వహకులకు అదిరిపోయే షాక్ ఇచ్చిందని తెలుస్తోంది.

అదిరింది ఆగిపోవడం పక్కానా?

జనవరి నెలలో వచ్చిన టీఆర్పీ రేటింగ్ చూస్తే.. జబర్థస్త్ పోటీ అనుకున్న అదిరింది షో కనీసం తమ చానల్ లో ప్రసారం అవుతున్న కార్యక్రమాల కన్నా చిట్టచివరి స్థానంలో నిలబడింది. జీ తెలుగులో ప్రసారం అవుతున్న లోకల్ గ్యాంగ్ కంటే వెనుక స్థానంలో అదిరింది ఆగిపోయింది. దీంతో అదిరింది షోపై నిర్వాహకులు పునరాలోచనలో పడినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఒక కార్యక్రమం విజయవంతం కావడానికి ఎన్నికార్యక్రమాలు ఉంటాయో విక్షకుల దగ్గరకు చెరలేకపోవడం కూడా ఉన్నాయి. ఆ విధంగా చూస్తే అదిరింది షో వెనకబడడానికి చాలా కారణాలు ఉంటాయనే చెప్పుకోవచ్చు. కామెడీషోకి కావాల్సిన నటినటుల బలం అదిరిందికి ఉంది. కామెడీ షోలను నడిపించగల దర్శక ద్వయం ఉంది. షోలతో సంబందం లేకుండా వీక్షకులను ఆకట్టుకోగలిగిన న్యాయనిర్ణేతలు ఉన్నారు. కాస్తో కూస్తో యంకరింగ్ చేయగలిన వారు ఉన్నారు. అయితే అదిరింది ఆగిపోబోతుందని కూడా అనుకుంటున్నారు.

అదిరింది అదరలేకపోవడానికి కారణాల్లో వీక్షకులు, విమర్శకులు చెబుతున్న మూడు మాటాలు పాత సీసాలో కొత్త సారాలా ఉండడం, తెచ్చి పెట్టుకున్న నవ్వును కార్యక్రమానికి అతికినట్లు చూపించలేని యాంకర్ వైఫల్యం, అన్నిటికిమించి ప్రసారాల క్వాల్టీ కూడా ఏమాత్రం అందరికీ ఆమోదయోగ్యం కాకుండా ఉందని చెప్పుకోటున్నారు. వీటి మధ్యలో నాగబాబు పరిస్థితి గందరగోళంగా తయారైనట్లు తెలుస్తోంది. జబర్ధస్త్ వదలి వచ్చే ముందు ఆ షో నిర్వాహకులపై వీపరింతగా కామెంట్స్ చేశారు. అదిరింది ప్రారంభం అయిన తర్వాత ఆయన జబర్థస్త్ పై విమర్శలు కురిపించారు. ఈ నేపథ్యంలో అదిరింది ఆగిపోతే నాగబాబు ఎం చేస్తారో అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఇక జబర్థస్త్ లో మంచి కళాకారుడిగా పెరొందిన చమక్ చంద్ర అదిరిందికి వచ్చారు. ఆయనతో పాటు మరికొందరు కళాకారులు వచ్చారు. మరి వీరందరి పరిస్థితి ఎలావుండబోతుంది అనేది అందరిని ఆలోచనలో పడేసింది.

మొత్తం మీద జబర్థస్త్ అనే నవ్వుల ప్రస్థానానికి అడ్డుకట్ట లేదా నవ్వుల జల్లు కురిపించే కార్యక్రమం ప్రస్తుతానికి కనిపించడం లేదని వీక్షకుల అభిప్రాయం. దానికి టీఆర్పీ రేటింగులే సాక్ష్యం. ఇక ముందు అదిరింది షో నడుస్తుందా? కనీసం నిలదొక్కునే టీఆర్పీ రేటింగులు సాధిస్తుందా? లేదా అనేది వేచిచూడాల్సిందే. అందుకే కొన్ని నిర్ణయాలు ఎప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోతాయి. అందులో జబర్థస్త్ షో వీడిపోవడంలో నాగబాబు తీసున్న నిర్ణయం కూడా ఒకటి కాబోతుందా అనేది ఆయన అభిమానుల్లో నెలకొంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories