Adipurush: శ్రీవారి సన్నిధిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్

Adipurush Pre Release Event In Tirupati
x

Adipurush: శ్రీవారి సన్నిధిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్

Highlights

Adipurush: ప్రభాస్ నటించిన మైథలాజికల్ మూవీ ఆది పురుష్ ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న రిలీజ్ కానుంది.

Adipurush: ప్రభాస్ నటించిన మైథలాజికల్ మూవీ ఆది పురుష్ ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న రిలీజ్ కానుంది. రామాయణం ఇతివృత్తంగా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ సినిమాలో కృతిసనన్ సీతగా కనిపించనుంది. ఈ మూవీ ట్రైలర్ ను ఇటీవలే రిలీజ్ చేయగా...మంచి రెస్పాన్స్ దక్కించుకొని సినిమా పై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్ చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు.

ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను జూన్ 3న నిర్వహించనున్నట్లు, దీనికి ఎస్ఎస్. రాజమౌళి చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారని గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన యూవీ క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. ప్రీ రిలీజ్ వేడుకలను ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో జూన్ 6న నిర్వహించనున్నామని యూవీ సంస్థ ట్విటర్ వేదికగా అనౌన్స్ చేసింది.

ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఎస్వీ గ్రౌండ్స్ లో నిర్వహించే అవకాశం ఉంది. ఎందుకంటే బాహుబలి ది బిగినింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతి ఎస్వీ గ్రౌండ్స్ లోనే జరిపారు. ఆ సినిమా బంపర్ హిట్టయింది. అదే సెంటిమెంట్ ని ఫాలో చేస్తూ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. మరి, ఈ ఈవెంట్ కు జక్కన్న వస్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories