నాని సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన అదాశర్మ

నాని సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన అదాశర్మ
x
Highlights

వరుసగా రెండు డిజాస్టర్ లను చవిచూసిన నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం 'జెర్సీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. స్పోర్ట్స్...

వరుసగా రెండు డిజాస్టర్ లను చవిచూసిన నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం 'జెర్సీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. స్పోర్ట్స్ డ్రామా గా 'మళ్లీ రావా' ఫేమ్ గౌతమ్ తిన్న నూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో నాని ఒక క్రికెటర్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. శ్రద్ధా శ్రీనాధ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా హాట్ బ్యూటీ ఆదా శర్మ ఈ సినిమాలో నానితో పాటు ఒక స్పెషల్ సాంగ్ లో డ్యాన్స్ చేయబోతోందని వార్తలు వచ్చాయి.

ఈ విషయం గురించి ఈ మధ్యనే క్లారిటీ ఇచ్చింది 'క్షణం' బ్యూటీ. ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని, ఇప్పటిదాకా తనను ఎవరు సంప్రదించలేదు అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాక తెలుగులో తాను ప్రస్తుతం నటిస్తున్న ఒకే ఒక్క సినిమా 'కల్కి' అని స్పష్టం చేసింది. అదా శర్మ, సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా 'అ!' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'కల్కి' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మొత్తానికి నాని సినిమాలో మాత్రం ఆదా కనిపించదు అని క్లారిటీ వచ్చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories