ఆర్ధిక సహాయం కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్

Ruthvik
Published on: 25 Feb 2019 2:41 PM IST
ఆర్ధిక సహాయం కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్
X

సినిమా వాళ్ళు అంటే ఒకప్పుడు ప్రజల అభిప్రాయం ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు అని కొందరు అనుకుంటూ వుంటారు. కానీ ఒక హీరోయిన్ పరిస్థితి ఇప్పుడు దిక్కులేకుండా అయిపోయింది అంటే నమ్మగలరా? ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్ ఎవరంటే 'హనుమాన్ జంక్షన్' సినిమాలో జగపతి బాబు, అర్జున్ కి చెల్లెలి పాత్రలో, వేణు కి లవర్ గా నటించిన విజయలక్ష్మి. ఈ సినిమా తర్వాత ఆమె కన్నడలో 'నాగమండల', 'సూర్యవంశ' వంటి హిట్ చిత్రాల్లో నటించింది. కన్నడలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అయితే అనారోగ్య కారణం వల్ల తన తల్లి ఆసుపత్రి కోసం డబ్బంతా ఖర్చు చేసింది విజయ లక్ష్మి. ఆ తర్వాత తాను కూడా ఆనారోగ్యంతో ఆసుపత్రి పాలు అయ్యింది. ఆర్ధికంగా పరిస్థితి అసలు బాగోలేకపోవడంతో ఆమె సోదరి ఉషాదేవి తమ ను ఆదుకోవాలి అని దాతలను అభ్యర్డిస్తూ ప్రకటన చేశారు. ప్రస్తుతం బెంగళూరులోని మాల్యా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయ లక్ష్మిని కాపాడమని ఆర్ధిక సహాయం చేసి తల్లిని సోదరిని ఆదుకోమని ఉషాదేవి అన్నారు. వెంటనే స్పందించిన కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ కొంత ఆర్ధిక సహాయాన్ని అందించారు అని తెలుస్తుంది.

Ruthvik

Ruthvik

Next Story