గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో త్రిష!

Trisha Participates In Green India Challenge : టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge)కి వీపరీతమైన రెస్పాన్స్ వస్తుంది.

Krishna
Published on: 3 Oct 2020 3:10 PM IST
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో త్రిష!
X

Trisha Participates In Green India Challenge : టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge)కి వీపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. 3వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కూడా సినీ,రాజకీయ ప్రముఖులు ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటుతూ మిగతా వారిని కూడా మొక్కలు నాటలని కోరుతున్నారు. ఇలా నలుమూలలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యాప్తి చెందింది. మూడు కోట్ల మొక్కలకు ఈ ఛాలెంజ్ చేరువైంది.

అందులో భాగంగానే తాజాగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ విసిరిన ఛాలెంజ్ ను నటి త్రిష స్వీకరించారు. అందులో భాగంగా తన ఫాంహౌస్‌లో మొక్కలు నాటారు. అనంతరం ఆ ఫోటోలను తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యవరణ పరిరక్షణకు పాటుపడాలని, పచ్చటి భారతదేశం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని త్రిష పిలుపునిచ్చారు. అటు ప్రకాష్ రాజ్ త్రిషతో పాటుగా కన్నడ నటుడు మోహన్‌లాల్, తమిళ్ నటుడు సూర్య, కన్నడ నటుడు రక్షిత్ శెట్టి, రమ్యకృష్ణకి ఛాలెంజ్ విసిరారు.

ఇక త్రిష విషయానికి వచ్చేసరికి అందం, అభినయంతో ఆకట్టుకుంటూ తెలుగు, తమిళ్ చిత్రపరిశ్రమలో దాదాపుగా 15 సంవత్సరాలు కెరీర్ ని కొనసాగించింది త్రిష..తరుణ్ హీరోగా వచ్చిన 'నీమనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయం అయిన త్రిష వర్షం సినిమాతో పెద్ద హిట్ ని అందుకుంది. అతడు, నువ్వస్తానంటే నేనోదంటానా మొదలగు చిత్రాలతో వరుసగా హిట్లు కొట్టి తెలుగులో కొన్ని సంవత్సరాలు తెలుగులో టాప్ హిరోయిన్‌లలో ఒకరుగా కొనసాగుతూ వచ్చింది త్రిష.. ప్రస్తుతం తమిళ్, మలయాళ చిత్రాలలో నటిస్తోంది.

Krishna

Krishna

Next Story