సీఎం కేసీఆర్ పై ప్రకాష్ రాజ్ ప్రశంసలు!

సీఎం కేసీఆర్ పై ప్రకాష్ రాజ్ ప్రశంసలు!
x

KCR, prakash raj

Highlights

Prakash Raj Participates In Green India Challenge : టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge)కి వీపరీతమైన రెస్పాన్స్ వస్తుంది.

Prakash Raj Participates In Green India Challenge : టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge)కి వీపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. 3వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కూడా సినీ,రాజకీయ ప్రముఖులు ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటుతూ మిగతా వారిని కూడా మొక్కలు నాటలని కోరుతున్నారు. ఇలా నలుమూలలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యాప్తి చెందింది. మూడు కోట్ల మొక్కలకు ఈ ఛాలెంజ్ చేరువైంది.

అందులో భాగంగానే తాజాగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ షాద్ నగర్ లోని తన వ్యవసాయ క్షేత్రంలో తన కుమారునితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ లపైన ప్రశంసలు కురిపించారు.. వారిద్దరూ మట్టి మనుషులని ప్రకాష్ రాజ్ కొనియాడారు. కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిన కొన్ని సంవత్సరాలలోనే రాష్ట్రం మొత్తం ఆకుపచ్చ తెలంగాణ మారిందని ప్రకాష్ రాజ్ అన్నారు.

ఇక తానూ కూడా ఇందులో పాల్గొనందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇలాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొనసాగాలని అన్నారు. ఈ సందర్భంగా పలువురికి గ్రీన్ ఇండియా సవాలు విసిరారు ప్రకాష్ రాజ్.. అందులో కన్నడ నటుడు మోహన్‌లాల్, తమిళ్ నటుడు సూర్య, కన్నడ నటుడు రక్షిత్ శెట్టి, హీరోయిన్లు రమ్యకృష్ణ, త్రిష ఉన్నారు. అటు తన అభిమానులు కూడా మొక్కలు నాటలని, ఒక్కొక్కరు పది మొక్కలు నాటలని ప్రకాష్ రాజ్ అన్నారు.

ఇక ప్రస్తుతం ప్రకాష్ రాజ్ తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వస్తున్న అల్లుడు అదుర్స్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో తాజాగా ప్రకాష్ రాజ్ పాల్గొన్నాడు. అటు కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న రంగామర్తండ సినిమాలో కూడా ప్రకాష్ కీరోల్ ప్లే చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories