Taapsee: 'నా భర్త ఎవరో తెలియకపోవడం బాధాకరం'.. తాప్సీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

Taapsee: 'నా భర్త ఎవరో తెలియకపోవడం బాధాకరం'.. తాప్సీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 29 July 2024 7:30 PM IST
Actress tapsee intresting comments about her husband in recent interview
X

Taapsee: 'నా భర్త ఎవరో తెలియకపోవడం బాధాకరం'.. తాప్సీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

Taapsee: 2010లో వచ్చిన జుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార తాప్సీ. తొలి సినిమాతోనే తనదైన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుందీ చిన్నది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా పెద్దగా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తాప్సీ కెరీర్‌ ఒక్కసారిగా మారిపోయింది.

నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తూ మెప్పించిందీ బ్యూటీ. బాలీవుడ్‌లో తాప్సీ నటించిన ప్రతీ సినిమా మంచి విజయాన్ని సాధించాయి. తాప్సీ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఈక్రమంలోనే ఈ బ్యూటీ నటించిన చిత్రం 'హసీనా దిల్‌రుబా'. ఈ సినిమాలో తాప్సీ తన అద్భుత నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ‘ఫిర్‌ అయీ హసీనా దిల్‌రుబా’ పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్న ఈసినిమా ప్రమోషన్స్‌ను తాప్సీ ప్రస్తుతం బిజీగా ఉంది.

ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తన భర్త మథియాస్‌ బో గురించి మాట్లాడారు. తన భర్త చాలా మందికి తెలియదని. అందుకు చింతిస్తున్నట్లు తాప్సీ చెప్పుకొచ్చారు. ఈ విషయమై తాప్సీ మాట్లాడుతూ.. నాభర్త మథియాస్‌బో నాకు చాలా కాలంగా తెలుసు. ఇష్టాయిష్టాలు కలవడంతో స్నేహితులమయ్యాం. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం. అయితే, మథియాస్‌ ఎవరనేది చాలామందికి తెలియకపోవడం బాధాకరమని చెప్పుకొచ్చింది.

ఇక మథియాస్‌ బో ఏం చేస్తున్నాడు, ఏం సాధించాడనేది చెప్పాలనుకోవడం లేదన్న తాప్సీ.. వ్యాపారవేత్త, లేదా క్రికెటర్‌ కానందున అతని గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదని, అంతర్జాతీయస్థాయిలో ఎన్నో విజయాలు అందుకున్న బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు నా భర్త అంటూ చెప్పుకొచ్చింది తాప్సీ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story