షూటింగ్ మధ్యలోనే పేకప్‌ చెప్పేసిన శ్రుతిహసన్.. కారణం అదేనట?

ఎస్పీ జననాథన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శేరవేగంగా జరుపుకుంటుంది. సినిమాకి సంబంధించిన క్లైమాక్స్‌ చిత్రీకరణ ఇటీవల ధర్మపురి, కృష్ణగిరి పరిసర ప్రాంతాల్లో జరిగింది.

Krishna
Published on: 23 Nov 2020 1:34 PM IST
షూటింగ్ మధ్యలోనే పేకప్‌ చెప్పేసిన శ్రుతిహసన్.. కారణం అదేనట?
X

Sruthi Haasan Left Laabam Shooting Spot : విలక్షణ నటుడు కమల్ హసన్ కుమార్తెగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది శ్రుతి హసన్. తమిళ్, తెలుగులో విభిన్నమైన చిత్రాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. గతకొంత కాలంగా సినిమాలకి బ్రేక్ ఇచ్చిన శ్రుతి హసన్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీఅయిపొయింది. తెలుగులో రవితేజ, పవన్ కళ్యాణ్ సినిమాలను చేస్తోంది శ్రుతి హసన్. ఇక తమిళ్ లో విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'లాభం' అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఎస్పీ జననాథన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శేరవేగంగా జరుపుకుంటుంది. సినిమాకి సంబంధించిన క్లైమాక్స్‌ చిత్రీకరణ ఇటీవల ధర్మపురి, కృష్ణగిరి పరిసర ప్రాంతాల్లో జరిగింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు విజయ్‌-శ్రుతిహాసన్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో వచ్చారు. దీంతో హీరోయిన్ శ్రుతిహాసన్‌ షూటింగ్‌ మధ్యలోనే పేకప్ చెప్పేసి సెట్‌ నుంచి వెళ్లిపోయారు.

అయితే ప్రస్తుతం ఎదురుకుంటున్న కరోనా పరిస్థితుల దృష్ట్యా జనసముహల్లో ఉండడం అంతమంచిది కాదని భావించి శ్రుతి హసన్ అక్కడినుంచి వేల్లిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక ఇటివల 'కరోనా వలన ప్రతిఒక్కరీ ఆరోగ్యానికి ప్రమాదం ఉంది. అది ఇంకా అంతం కాలేదు. ప్రోటోకాల్స్‌ ఫాలో కాని తరుణంలో ఒక మహిళగా, నటిగా జాగ్రత్తలు తీసుకునే హక్కు నాకు ఉంది.' అంటూ శ్రుతి హసన్ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.

Krishna

Krishna

Next Story