చిక్కుల్లో 'బిగ్‌బాస్' దర్శన్.. మోసం చేశాడంటూ హీరోయిన్ ఫిర్యాదు!

Sanam Shetty Complaint On Tharshan : తమిళ, తెలుగు నటి సనంశెట్టి, నటుడు, తమిళ బిగ్‌బాస్‌ ఫేమ్‌ దర్శిన్ మధ్య గత కొద్ది కాలంగా లవ్ ట్రాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే.. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి.

Krishna
Published on: 6 Oct 2020 3:10 PM IST
చిక్కుల్లో బిగ్‌బాస్ దర్శన్.. మోసం చేశాడంటూ హీరోయిన్ ఫిర్యాదు!
X

Sanam Shetty Complaint On Tharshan

Sanam Shetty Complaint On Tharshan : తమిళ, తెలుగు నటి సనంశెట్టి, నటుడు, తమిళ బిగ్‌బాస్‌ ఫేమ్‌ దర్శిన్ మధ్య గత కొద్ది కాలంగా లవ్ ట్రాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే.. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. అయితే తనని దర్శిన్ మోసం చేశాడంటూ సనంశెట్టి సంచలన ఆరోపణలు చేసింది.. ఈ మేరకు ఆమె చెన్నైలోని అడయార్ ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌ ను ఆశ్రయించింది.

సనంశెట్టి ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు దర్శిన్‌పై కేసు నమోదు చేయలేదు.. దీనితో న్యాయం కోసం నటి సనంశెట్టి కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు దర్శిన్‌ పై కేసు నమోదు చేశారు. మహిళా వేధింపులు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదుతో సహా 4 సెక్షన్ల కింద దర్శన్‌ పైన కేసు నమోదు అయింది. త్వరలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక దీనిపైన సనంశెట్టి మాట్లాడుతూ.. " దర్శిన్‌, నేను గత కొంతకాలంగా ప్రేమించుకున్నాం. పెళ్ళి కూడా చేసుకోవాలని అనుకున్నాం. కానీ దర్శిన్‌ ఉన్నట్టుండి నాతో మాట్లాడటం మానేశాడు. నన్ను మ్యారేజ్‌ చేసుకునేందుకు నో చెబుతున్నాడు. ఇలా నమ్మించి మోసం చేసిన దర్శిన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను" అని సనంశెట్టి వెల్లడించింది.

ఇక సనంశెట్టి మోడల్ నుంచి హీరోయిన్ గా మారింది. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. తెలుగులో శ్రీమంతుడు, ప్రేమికుడు, ఇంటింటా అన్నమయ్య చిత్రాలలో నటించింది

Krishna

Krishna

Next Story