Sameera Reddy : సినిమా ఇండస్ట్రీలో పనిచేయడమంటే వైకుంఠపాళి ఆడటమే : సమీరారెడ్డి

Sameera Reddy : తెలుగు చిత్ర పరిశ్రమతో పాటుగా అన్ని చిత్ర పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ ఉంది అంటూ ఇప్పటికే పలువురు కామెంట్స్ చేసిన సంగతి

Krishna
Published on: 5 Sept 2020 11:15 AM IST
Sameera Reddy : సినిమా ఇండస్ట్రీలో పనిచేయడమంటే వైకుంఠపాళి ఆడటమే : సమీరారెడ్డి
X

Sameera Reddy

Sameera Reddy : తెలుగు చిత్ర పరిశ్రమతో పాటుగా అన్ని చిత్ర పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ ఉంది అంటూ ఇప్పటికే పలువురు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.. అందులో భాగంగా తాజాగా బాలీవుడ్ భామ సమీరారెడ్డి కూడా తానూ కూడా కాస్టింగ్‌ కౌచ్‌ భాదితురాలనే అంటూ కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమీరారెడ్డి ఈ వాఖ్యలు చేసింది. ఇందులో సమీరా ఇన్‌సైడర్స్‌ వర్సెస్‌ అవుట్‌సైడర్స్, క్యాస్టింగ్‌ కౌచ్‌ వంటి విషయాల్లో తన అనుభవాలను పంచుకుంది.

సినిమా ఇండస్ట్రీలో పని చేయడం అంటే వైకుంఠపాళి ఆడటమేనని అంది సమీరా. ఈ వైకుంఠపాళిలో ప్రతీ అడుగు జాగ్రత్తగా వేయాలని, తప్పటడుగు వెశామంటే పాము కాటు పడినట్టేనంటూ వాఖ్యానించారు సమీరా.. తానూ ఒక రోజు షూటింగ్ లో ఉండగా, ఆ రోజు సెట్‌లో స్క్రిప్టు మార్చి ముద్దు సన్నివేశం పెట్టారని, నాకు స్క్రిప్టు చెప్పినప్పుడు ఈ సీన్‌ లేదని, నేను చేయనని చెబితే మీ ఇష్టం ఆలోచించుకోండి... మీ స్థానంలో వేరే వాళ్లు వచ్చే అవకాశం ఉంటుంది అంటూ హెచ్చరించారని వెల్లడించింది సమీరా..

ఇక మరో సినిమాలో ఓ బాలీవుడ్‌ హీరోతో పనిచేస్తున్నప్పుడు 'నీతో నటించడం చాలా బోర్‌. మళ్లీ నీతో కలసి ఎప్పుడూ పని చేయను అని అన్నాడని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత అన్నట్టుగానే ఆ హీరో తన తరవాత సినిమాలో నన్ను హీరోయిన్ గా ఎంచుకోలేదని వెల్లడించింది. అటు ఇండస్ట్రీలో నెపోటిజిమ్‌ ఇక్కడ చాలా ఎక్కువనేని వెల్లడించింది. అయినప్పటికీ ఇండస్ట్రీ నాకు చాలా మంచి సినిమాలను ఇచ్చిందని చెప్పుకొచ్చింది సమీరా.. ఇక సమీరారెడ్డి తెలుగులో జై చిరంజీవ, అశోక్ సినిమాలలో నటించింది.

Krishna

Krishna

Next Story