సౌందర్య బయోపిక్‌లో స్టార్ హీరోయిన్?

Soundarya Biopic : ఇండియన్ సినిమాల్లో ప్రస్తుతం బయోపిక్ ట్రెండ్ నడుస్తుంది. సినీ, రాజకీయ, క్రీడాకారుల జీవితాల ఆధారంగా ఈ బయోపిక్ లను తెరకెక్కిస్తున్నారు మేకర్స్.

Krishna
Published on: 12 Oct 2020 2:50 PM IST
సౌందర్య బయోపిక్‌లో స్టార్ హీరోయిన్?
X

Soundarya

Soundarya Biopic : ఇండియన్ సినిమాల్లో ప్రస్తుతం బయోపిక్ ట్రెండ్ నడుస్తుంది. సినీ, రాజకీయ, క్రీడాకారుల జీవితాల ఆధారంగా ఈ బయోపిక్ లను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. వారి జీవిత చరిత్రను చూసేందుకు ప్రేక్షకులు కూడా బాగానే ఆసక్తి కనబరుస్తున్నారు. అందులో భాగంగానే తెలుగులో సావిత్రి మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు,మహానాయకుడు, వైఎస్సార్ యాత్ర మొదలగు బయోపిక్ లు వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. త్వరలోనే జయలలిత బయోపిక్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది..

అందులో భాగంగానే దక్షణాది భాషలలో అందరు స్టార్ హీరోల సరసన నటించిన సౌందర్య జీవితం ఆధారంగా బయోపిక్ తీసేందుకు ఓ నిర్మాణ సంస్థ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అయితే సౌందర్య పాత్రను చేసేందుకు మేకర్స్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవిని సంప్రదించినట్టుగా తెలుస్తోంది. దీనికి సాయి పల్లవి కూడా ఒకే చెప్పినట్టుగా సమాచారం.. త్వరలోనే దీనిపైన ఓ అధికార ప్రకటన వెలువడనుంది.

ఇక దక్షణాది భాషలలో వందకి పైగా సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది సౌందర్య.. ముఖ్యంగా సావిత్రి తర్వాత మరో సావిత్రి అంటూ ఆమెకి పేరు వచ్చింది. అలా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో సౌందర్య బెంగళూరులో జరిగిన ఓ విమాన ప్రమాదంలో మరణించింది. ఆమె మరణవార్త అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీనే కాదు యావత్ భారతీయ సినిమానే కదిలిచింది.. అయితే ఇప్పుడు ఆమె పైన బయోపిక్ వస్తుండడంతో సినిమా పైన అంచనాలు నెలకొన్నాయి.

Krishna

Krishna

Next Story