రియా చక్రవర్తికి మరో షాక్‌ ఇచ్చిన కోర్టు!

Rhea Chakraborty’s Judicial Custody : బాలీవుడ్ నటి రియా చక్రవర్తికి మరో షాక్‌ ఇచ్చింది కోర్టు.. ఆమె జ్యుడీషియల్‌ కస్టడీని మరో 14 రోజుల వరకు

Krishna
Published on: 22 Sept 2020 6:48 PM IST
రియా చక్రవర్తికి మరో షాక్‌ ఇచ్చిన కోర్టు!
X

Rhea Chakraborty

Rhea Chakraborty's Judicial Custody : బాలీవుడ్ నటి రియా చక్రవర్తికి మరో షాక్‌ ఇచ్చింది కోర్టు.. ఆమె జ్యుడీషియల్‌ కస్టడీని మరో 14 రోజుల వరకు అంటే అక్టోబర్ 6 వరకు పొడిగిస్తూ నార్కోటిక్‌ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం ప్రత్యేక కోర్టు తీర్పును వెల్లడించింది. మరోవైపు బెయిల్ కోసం బాంబే హైకోర్టును రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి ఆశ్రయించారు.

మాదకద్రవ్యాలు సరఫరా కేసులో భాగంగా ఆమెను నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూర్‌ (ఎన్‌సీబీ) సెప్టెంబర్‌ 8న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. అనంతరం ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. అయితే తాజాగా ఆమె కస్టడీని పొడిగించింది. గతంలో రియా ఆమె సోదరుడు బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేసుకోగా ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

ఇక జూన్ 14న ముంబైలోని బాంద్రాలో తన అపార్ట్‌మెంట్‌లో నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. అయితే ఇది ఆత్మహత్య కాదని, హత్య అని నటి కంగనాతో పాటుగా సుశాంత్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేయడంతో సుప్రీంకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పజెప్పింది.. ఈ క్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), నార్కోటిక్స్ విభాగం సైతం రంగంలోకి దిగింది. దీనితో డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చింది.

అనంతరం విచారణలో రియా, రియా సోదరుడు కీలక విషయాలను బయటపెట్టారు.. విచారణలో రియా చక్రవర్తి 25 మంది సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా వెల్లడించిందని అందులో రకుల్, సారా ఆలీఖాన్ పేర్లు ఉన్నట్టుగా తాజాగా ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ కేపీఎస్‌ మల్హోత్రా వెల్లడించారు. త్వరలో వీరిని కూడా విచారించనుంది ఎన్‌సీబీ..

Krishna

Krishna

Next Story