Actress Rekha Security Guard corona positive: వెటరన్ స్టార్ రేఖ ఇంటికి కూడా కరోనా .. ఆమె బంగ్లా సీజ్!

Actress Rekha Security Guard corona positive: వెటరన్ స్టార్ రేఖ ఇంటికి కూడా కరోనా .. ఆమె బంగ్లా సీజ్!
x
rekha
Highlights

Actress Rekha Security Guard corona positive: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరికి సోకి భయబ్రాంతులకి గురి చేస్తోంది

Actress Rekha Security Guard corona positive: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరికి సోకి భయబ్రాంతులకి గురి చేస్తోంది.. ఇక ఇప్పటికే సినీ స్టార్స్ చాలా మంది కరోనా బారినా పడ్డారు. ఇక బాలీవుడ్ వెటరన్ స్టార్ రేఖ ఇంటికి కూడా కరోనా సోకింది. ఆమె ఉంటున్న బంగ్లాలోని సెక్యూరిటీ గార్డ్ కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడంతో ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు ఆమె ఉంటున్న బంగ్లాను సీల్ చేశారు. అంతేకాకుండా బంగ్లా బయట కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటిస్తూ నోటీసులు కూడా అతికించారు.

తన సహాయ సిబ్బందికి కరోనా రావడంతో నటీ రేఖ కూడా అప్రమత్తం అయ్యారు. నటీ రేఖ బంగ్లా ముంబైలోని బాంద్రాలోని, బ్యాండ్‌స్టాండ్ ప్రాంతంలో ఉంది. దీనికి సీ స్ప్రింగ్స్ అని పేరు పెట్టారు. అయితే ఈ ఇంటికి ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఎల్లప్పుడూ ఉంటారు. వారిలో తాజాగా ఒకరికి కరోనా అని తేలడంతో ప్రస్తుతం మిగతా సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

అమితాబ్ , అభిషేక్ లకు కరోనా!

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని అమితాబ్ స్వయంగా ప్రకటించారు. ఇక అర్ధరాత్రి సమయంలో అయన తనయుడు నటుడు అభిషేక్ బచ్చన్ కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వీరు ముంబాయి లోని నానావతి ఆసుపత్రిలో చేరారు. అయితే తమ అభిమానులను కంగారు పడవద్దంటూ అభిషేక్ కోరారు. ఇక అమితాబ్ లో కరోనా లక్షణాలు స్వల్ప స్థాయిలో ఉన్నట్లుగా వైద్యులు వెల్లడించారు. అటు బిగ్ బీ కూడా తనతో గత పదిరోజులుగా దగ్గరగా గడిపిన అందరినీ కరోనా పరీక్షలు చేయించుకోవాలని అయన కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories