రష్మికకి భారీ ఆఫర్.. అక్కడ ఆ స్టార్ హీరోతో సినిమా!

రష్మికకి భారీ ఆఫర్.. అక్కడ ఆ స్టార్ హీరోతో సినిమా!
x
Highlights

కన్నడ భామ రష్మిక మందన్నా దూకుడు ఇప్పుడు మామాలుగా లేదు. వరుస హిట్లతో ఈ భామ మంచి జోష్ లో ఉంది. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు, భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ లు రావడంతో రష్మికకి భారీ ఆఫర్స్ వస్తున్నాయి.

కన్నడ భామ రష్మిక మందన్నా దూకుడు ఇప్పుడు మామాలుగా లేదు. వరుస హిట్లతో ఈ భామ మంచి జోష్ లో ఉంది. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు, భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ లు రావడంతో రష్మికకి భారీ ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న 'పుష్ప అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది రష్మిక. అంతేకాకుండా శర్వానంద్, కిషోర్ తిరుమల కాంబోలో వస్తున్న 'ఆడాళ్ళు మీకు జోహార్లు' అనే సినిమాలో కూడా నటిస్తోంది ఈ భామ.

ఇప్పటివరకు కన్నడ, తెలుగు భాషలలోనే నటించిన రష్మిక ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీ పైన కూడా కన్నేసింది. ప్రస్తుతం కార్తి సరసన 'సుల్తాన్‌' అనే సినిమాలో నటిస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం కోలీవుడ్ లోనే రష్మిక భారీ ఆఫర్ కొట్టేసిందని తెలుస్తోంది. సూర్య, పాండిరాజ్ కాంబోలో వస్తున్న సినిమాలో రష్మిక ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రష్మికతో కథ చర్చలు జరగగా రష్మిక కూడా పచ్చజెండా ఉపెసినట్టుగా సమాచారం. దీనిపైన త్వరలోనే అధికార ప్రకటన వెలువడనుంది.

ఇక ఇటివలే ఆకాశం నీ హద్దురా సినిమాతో భారీ హిట్ కొట్టేశారు సూర్య, సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒటీటీ వేదికగా రిలిజై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా హిట్ కావడంతో కోలీవుడ్ లో సూర్య రేంజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. సూర్యతో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు మాత్రమే కాదు హీరోయిన్స్ కూడా పోటి పడుతున్నారు. మరి ఈ సినిమా రష్మికకి ఎలాంటి హిట్ ని అందిస్తుందో చూడాలి మరి!


Show Full Article
Print Article
Next Story
More Stories