విజయ్‌ దేవరకొండ ఇంట్లో రష్మిక... వైరల్ అవుతున్న పిక్స్!

Rashmika Mandanna Attend Vijay Devarakonda : గీతా గోవిందం చిత్రంతో క్యూట్‌ పెయిర్ గా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మంచి పేరు సంపాందించుకున్నారు.

Krishna
Published on: 25 Sept 2020 12:09 PM IST
విజయ్‌ దేవరకొండ ఇంట్లో రష్మిక... వైరల్ అవుతున్న పిక్స్!
X

Rashmika Mandanna attends Vijay Devarakonda Mother's 50th Birthday

Rashmika Mandanna Attend Vijay Devarakonda : గీతా గోవిందం చిత్రంతో క్యూట్‌ పెయిర్ గా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మంచి పేరు సంపాందించుకున్నారు. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ చిత్రంతో మరోసారి తెరపైన కనిపించి ప్రేక్షకులను అలరించారు. మళ్ళీ ఈ జంట కలిసి ఎప్పుడు నటిస్తారా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్‌ దేవరకొండ ఇంట్లో జరిగిన ఓ పార్టీకి రష్మిక హాజరయ్యింది.

దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ తల్లి మాధవి 50వ పుట్టినరోజు వేడుకలో భాగంగా రష్మిక పాల్గొంది. అనంతరం విజయ్ ఫ్యామిలీతో కలిసి కొన్ని ఫొటోలకి ఫోజులు ఇచ్చింది. అయితే అతికొద్ది మంది మాత్రమే ఈ వేడుకకి హాజరు అయ్యారు. విజయ్‌ ఫ్యామిలీతో రష్మికను చూసిన అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు.

ఇక ఈ ఏడాది వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన అనన్యపాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని చార్మీ నిర్మిస్తోంది. సినిమాకి ఫైటర్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.

అటు ఈ ఏడాది 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ' సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్‌ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా వలన ఈ సినిమా వాయిదా పడింది.

Krishna

Krishna

Next Story