షూటింగ్ స్పాట్ నుంచి వెళ్ళిపోయిన రకుల్ !

Rakul Preet Singh Get Away From Shooting : బాలీవుడ్ లో మొదలైన డ్రగ్స్ కలకలం టాలీవుడ్ కి సోకింది. ఈ కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి

Krishna
Published on: 12 Sept 2020 4:41 PM IST
షూటింగ్ స్పాట్ నుంచి వెళ్ళిపోయిన రకుల్ !
X

Rakul Preet Singh Get Away From Shooting

Rakul Preet Singh Get Away From Shooting : బాలీవుడ్ లో మొదలైన డ్రగ్స్ కలకలం టాలీవుడ్ కి సోకింది. ఈ కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి బాలీవుడ్‌లో మాదకద్రవ్యాల సరఫరా, కొనుగోలు చేసే 25 మంది సెలబ్రిటీల పేర్లను అందులో వెల్లడించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే అందులో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ పేరు కూడా వినిపిస్తోంది. త్వరలోనే వీరిని కూడా నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) విచారించనుందని తెలుస్తోంది.

అయితే రకుల్‌ కూడా డ్రగ్స్‌ వాడుతుందంటూ వస్తున్న పుకార్లపై ఆమె సన్నిహితులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తలతో కాస్తా అసహనానికి గురైన రకుల్ ప్రీత్ సింగ్ శనివారం వికారాబాద్ శివారులోని షూటింగ్ స్పాట్ నుంచి జూబ్లీహిల్స్‌ లోని తన నివాసానికి వెళ్ళిపోయింది. అయితే ఆమెపై వస్తున్న వార్తలను ఆమె మేనేజర్ మాత్రం ఖండిస్తున్నారు. తనపై కుట్రతో ఇదంతా చేస్తున్నారని వాదించారు.

కరోనా వలన షూటింగ్ లు లేకపోవడంతో సినీ నటులు తమ సమయాన్ని పూర్తిగా ఇంటికే కేటాయించారు. తాజాగా మళ్ళీ షూటింగ్ లు మొదలు కావడంతో షూటింగ్ లో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే రకుల్ గతవారం కిందటే ఢిల్లీ నుంచి హైదరాబాదుకి చేరుకున్నారు. గత మూడు రోజులుగా తెలంగాణలోని వికారాబాద్ శివారులో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంటు వస్తున్నారు. అలాగే ఈ రోజు కూడాఅ ఆమె షూటింగ్ లో పాల్గొన్నారు. షూటింగ్ స్పాట్ నుంచి ఆమె మధ్యలోనే ఇంటికి వెళ్ళిపోయారు.

Krishna

Krishna

Next Story