Nivedhitha : గంజాయి చట్టబద్ధం చేయండి : హీరోయిన్ సంచలన వాఖ్యలు

Nivedhitha : సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం రేపుతుంది.. బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ కేసులో విచారణ చేస్తున్న ఎన్‌సీబీ నటి రియా

Krishna
Published on: 7 Sept 2020 11:03 AM IST
Nivedhitha : గంజాయి చట్టబద్ధం చేయండి : హీరోయిన్ సంచలన వాఖ్యలు
X

Nivedhitha  

Nivedhitha : సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం రేపుతుంది.. బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ కేసులో విచారణ చేస్తున్న ఎన్‌సీబీ నటి రియా చక్రవర్తి సోదరుడు షోవిక్‌ను ఇదే కేసులో భాగంగా అరెస్ట్ చేసింది. అటు శాండ‌ల్‌వుడ్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కన్నడ నటి, జెండా పై కపిరాజు ఫేమ్ రాగిణి ద్వివేదిని అదుపులోకి తీసుకున్న అధికారులు ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నారు. బుజ్జిగాడు సినిమా నటి సంజన కూడా నోటిసులు జారీ చేశారు.

ఈ నేపధ్యంలో రాగిణి ద్వివేదికి మ‌ద్దతు ఇస్తూ క‌న్నడ న‌టి నివేదిత చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మనదేశంలో గంజాయిని వినియోగాన్ని చట్టబద్ధం చేయాలని ఆమె పేర్కొంది. అంతేకాకుండా గంజాయి కూడా తులసి మొక్కలాంటిదే అంటూ కీలక వాఖ్యలు చేసింది. గంజాయిని బ్యాన్ చేసేముందు అది ఆయుర్వేదానికి వెన్నెముకలా ఉండేదని ఆమె పేర్కొంది. ప‌విత్రమైన తుల‌సిని గంజాయితో పోల్చడంతో నివేదిత‌ని సోష‌ల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు ఆమె పై విమర్శలు కురిపిస్తున్నారు.

ఇక నివేదిత‌ పలు కన్నడ, తమిళ్ భాషలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2008లో కన్నడలో వచ్చిన అబ్బా సినిమా ఆమెకి మంచి క్రేజ్ ని తీసుకువచ్చింది.

Krishna

Krishna

Next Story