Kannada Actress Ragini : సీసీబీ అదుపులో కన్నడ నటి రాగిణి!

Kannada Actress Ragini : కన్నడ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ అంశం కలకలం రేపుతుంది. చిత్ర పరిశ్రమకు సంబంధించి చాలా మంది సెలబ్రిటీలు

Krishna
Published on: 4 Sept 2020 4:34 PM IST
Kannada Actress Ragini : సీసీబీ అదుపులో కన్నడ నటి రాగిణి!
X

Kannada actress Ragini detained by Central Crime Branch in Bengaluru in connection with a drug case

Kannada Actress Ragini : కన్నడ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ అంశం కలకలం రేపుతుంది. చిత్ర పరిశ్రమకు సంబంధించి చాలా మంది సెలబ్రిటీలు డ్రగ్స్‌కు బానిసయ్యారని సినీ నిర్మాత ఇంద్రజిత్ లంకేష్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి.. దీనితో ఆయనని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అధికారులు పిలిపించి ఈ అంశం పైన ఆరా తీశారు. అంతేకాకుండా ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను అందించాలని కోరారు.. ఈ క్రమంలో అయన మరోసారి గురువారం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి వెళ్లి చేసిన ఆరోపణలకి గాను ఆధారాలు సమర్పించినట్లు సమాచారం.

ఈ నేపధ్యంలో నటి రాగిణికి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గురువారం సమన్లు జారీ చేశారు. డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించిన దర్యాప్తు కోసం శుక్రవారం తమ కార్యాలయానికి రావాలంటూ నోటీసులు పంపారు. ప్రస్తుతం సీబీఐ అధికారులు రాగిణిని ప్రశ్నిస్తున్నారు. ఇక ఇప్పటికే హీరోయిన్ రాగిణి ఫ్రెండ్ రవి శంకర్ అరెస్ట్ అయ్యాడు. రాగిణి విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. రాగిణి ద్వివేది బెంగళూరులో జన్మించారు. ఆమె 2009 లో " వీర మదకారి " చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది . కెంపే గౌడ, రాగిణి ఐపిఎస్, బంగారి, శివ చిత్రాల్లో ఆమె నటనకి గాను మంచి గుర్తింపు వచ్చింది.


Krishna

Krishna

Next Story