Nazriya Nazim: సోషల్ మీడియా డీటాక్స్.. సెలబ్రిటీస్ నయా ట్రెండ్.. లిస్ట్ లో చేరిన నజ్రియా నజీమ్

Nazriya Nazim: కొన్నాళ్లపాటు అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నాను.

Dhatripriya
Published on: 14 May 2023 3:05 PM IST
Actress Nazriya Nazim Takes Break From Social Media Platforms
X

Nazriya Nazim: సోషల్ మీడియా డీటాక్స్.. సెలబ్రిటీస్ నయా ట్రెండ్.. లిస్ట్ లో చేరిన నజ్రియా నజీమ్

Nazriya Nazim: ప్రస్తుతం సోషల్ మీడియాకు పలువురు సెలబ్రిటీలు బ్రేక్ ఇస్తున్నారు. సోషల్ మీడియా డీటాక్స్ పేరుతో సోషల్ ప్లాట్ ఫార్మ్స్ నుంచి దూరం జరుగుతున్నారు. మొన్నామధ్య సమంత కొంత కాలం సోషల్ మీడియా నుంచి వాకౌట్ చేసింది. ఆచార్య మూవీ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ ట్విట్టర్ కు గుడ్ బై కొట్టేశారు. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ సైతం తన ట్విట్టర్ ఖాతాను క్లోజ్ చేశాడు. సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటూ తన భర్త, పిల్లల ఫోటోలను షేర్ చేస్తూ ఉండే యష్ వైఫ్ రాధికా పండిట్ సైతం ఇప్పుడు బ్రేక్ ఇచ్చేశారు. ఇలా ఎంతో మంది వెండితెర, బుల్లితెర సెలబ్రిటీలు సోషల్ మీడియా డీటాక్స్ అంటుండగా తాజాగా ఈ లిస్ట్ లో నజ్రియా నజీమ్ కూడా చేరిపోయారు.

కొన్నాళ్లపాటు అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నాను. సోషల్ డీటాక్స్ కి ఇదే సరైన సమయం అనిపిస్తోంది. అభిమానుల ప్రేమను, సందేశాలను మిస్ అవుతాను. త్వరలో మళ్లీ కలుస్తాను అంటూ నజ్రియా పోస్ట్ పెట్టింది. మలయాళంలో స్టార్ హీరోయిన్ అయిన నజ్రియా మరెవరో కాదు. పార్టీ లేదా పుష్ప అంటూ తెలుగులో సంచలనం సృష్టించిన ఫాహద్ ఫాజిల్ అదేనండి మన వెండితెర భన్వర్ సింగ్ షెకావత్ భార్య. నజ్రియా మన తెలుగులో అంటే సుందరానికి సినిమాలో నటించింది. ఈమెకు ఇండియా వైడ్ క్రేజ్ ఉంది.

నజ్రియా ఇలా ఉన్నట్టుండి సోషల్ మీడియాకు బ్రేక్ ఇవ్వడం పై భిన్న వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ డీటాక్స్ కి తోడు ప్రణవ్ మోహన్ లాల్ సినిమా నుంచి కూడా తప్పుకోవడంతో నజ్రియా ప్రెగ్నెంట్ అయిందని మల్లువుడ్ లో టాక్ జోరుగా వినిపిస్తోంది. ఈ నేపధ్యంలోనే పార్టీ లేదా పుష్ప అంటూ కొంతమంది నెటిజన్స్ ఫాహద్ ను ఆటపట్టిస్తున్నారు కూడా. ఏదిఏమైనా, నజ్రియా సడెన్ గా సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకోవడంతో ఆమె ఫ్యాన్స్ తెగ వర్రీ ఔతున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story