Actress Koel Mallick tested Corona Positive: నటి కుటుంబానికి మొత్తానికి సోకిన కరోనా!

Actress Koel Mallick Corona Tested Positive: కరోనా ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సోకి ప్రతి ఒక్కరిని భయబ్రాంతులకి గురి చేస్తోంది.

Krishna
Updated on: 11 July 2020 8:03 PM IST
Actress Koel Mallick tested Corona  Positive: నటి కుటుంబానికి మొత్తానికి సోకిన కరోనా!
X

Actress Koel Mallick Corona Tested Positive: కరోనా ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సోకి ప్రతి ఒక్కరిని భయబ్రాంతులకి గురి చేస్తోంది. ఇక ఇప్పటికేచాలా మంది సినిమా స్టార్స్ కరోనా బారిన పడ్డారు. తాజాగా మరో న‌టీకి కూడా కరోనా సోకింది. ప్రముఖ బెంగాలి న‌టీ కోయెల్ మ‌ల్లిక్‌ కి కరోనా సోకింది. గత కొద్దిరోజులుగా ఆమెకి కరోనా లక్షణాలు కనిపించడంతో ఆమె కరోనా టెస్టులు చేసుకుంది. అందులో ఆమెకి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా వెల్లడించారు. ఇక్కడ మరో దారుణమైన విషయం ఏంటంటే ఆమెతో పాటుగా ఆమె ఫ్యామిలీ మొత్తానికి క‌రోనా సోకడం..

దీనిపైన ఆమె ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. తన తండ్రి, బెంగాలీ న‌టుడు రంజిత్ మ‌ల్లిక్‌, త‌ల్లి దీపా మాలిక్ భ‌ర్త, నిర్మాత నిస్ప‌ల్ సింగ్‌తో పాటు త‌న‌కి కరోనా సోకిన‌ట్టు కోయెల్ పేర్కొంది. ప్రస్తుతం మేం అంద‌రం క్వారంటైన్‌లో ఉన్నామని, త్వర‌లోనే కోలుకుంటామ‌ని భావిస్తున్నట్టుగా కోయెల్ వెల్లడించింది. ఇక కోయెల్‌తో పాటు ఆమె ఫ్యామిలీకి కరోనా సోకిన విషయం తెలియగానే అక్కడి సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ కి గురైంది. ఇక ఆమె అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ట్వీట్స్ చేస్తున్నారు.

ఇక ఘోర్ అండ్ బైర్, చాయా ఓ చోబి, శుభోద్రిష్టి మరియు హేమ్లాక్ సొసైటీ వంటి చిత్రాల‌తో మంచి ఫేం సంపాదించుకుంది కోయెల్ మ‌ల్లిక్‌. 2013 లో వివాహం చేసుకున్న కోయెల్ కి ప్రస్తుతం ఓ బాబు ఉన్నాడు.

ఇక కరోనా తీవ్రత దేశంలో రోజురోజుకు పెరుగుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 27,114 కేసులు నమోదు కాగా, 519 మంది ప్రాణాలు విడిచారు. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 8,20,916 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,83,407 ఉండగా, 5,15,385 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 22,123 మంది కరోనా వ్యాధితో మరణించారు.

Krishna

Krishna

Next Story