Kiara Advani: ఆడి కారు కొనుక్కున్న రామ్ చరణ్ హీరోయిన్

Kiara Advani New Car: కాస్ట్లీ కారు తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కియారా

admin1
Published on: 20 Dec 2021 5:10 PM IST
Actress Kiara Advani Buys New Audi A8 L Car Worth Rs. 1 56 Crore | Kiara Advani Car Collection
X

కాస్ట్లీ కారు తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కియారా(ఫైల్-ఫోటో)

Kiara Advani New Car: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హైయెస్ట్ పెయిడ్ నటీమణులలో కియారా అద్వానీ కూడా ఒకరు. ఒకవైపు బాలీవుడ్లో మాత్రమే కాక మరో వైపు టాలీవుడ్ లో సైతం ఈమె హవా బాగానే నడుస్తుంది. బాలీవుడ్లో కొన్ని బడా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కియారా అద్వానీ తెలుగులో రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఆమె నాలుగు కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. కాస్ట్లీ సినిమాలు చేస్తూ కెరియర్లో ముందుకు దూసుకుపోతున్న కియారా అద్వానీ తాజాగా ఇప్పుడు ఒక కాస్ట్లీ కారు కూడా కొనుక్కుంది.

తాజా సమాచారం ప్రకారం కియారా అద్వానీ ఈ మధ్యనే 1.6 కోట్లు విలువ చేసే ఒక ఆడి కార్ ని కొనుగోలు చేశారు. దానితో ఫోటో దిగి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. ఎప్పటినుంచో లగ్జరీ కార్లు అంటే ఇష్టమున్న కియారా అద్వానీ తనకు ఎంతగానో నచ్చిన ఆడి కారు కొనుక్కొని తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇక సినిమాల పరంగా చూస్తే ఈమధ్యనే కియారా అద్వానీ కి మరొక తెలుగు సినిమా ఆఫర్ వచ్చినట్లు సమాచారం. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

admin1

admin1

Next Story