డీగ్లామ‌ర‌స్ లుక్ లో కీర్తి!

డీగ్లామ‌ర‌స్ లుక్ లో కీర్తి!
x
Highlights

7/G బృందావనకాలినీ సినిమాతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న డైరెక్టర్ సెల్వరాఘ‌వ‌న్ న‌టుడిగా ఎంట్రీ ఇస్తున్నచిత్రం సానికాయిధ‌మ్‌. ఈ సినిమాకి అరుణ్ ‌మహేశ్వ‌ర‌న్ దర్శకత్వం వహిస్తున్నాడు.

నేను శైలజ సినిమాతో టాలీవుడ్ పరిచయమైంది టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్. ఆ తర్వాత నాని హీరోగా నటించిన నేను లోకల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి సినిమాలో అలనాటి తార సావిత్రి పాత్రను పోషించి అందరిచేత ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకి గాను కీర్తికి ఏకంగా జాతీయ అవార్డు వచ్చింది. మహానటి సినిమా తరవాత కంటెంట్ బేస్ ఉన్న సినిమాలనే ఎక్కువగా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంది కీర్తి సురేష్.. ఇటివల పెంగ్విన్ సినిమాతో అదరగొట్టిన కీర్తి సురేష్ మరో ఇంట్రెస్టింగ్ స్టొరీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

7/G బృందావనకాలినీ సినిమాతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న డైరెక్టర్ సెల్వరాఘ‌వ‌న్ న‌టుడిగా ఎంట్రీ ఇస్తున్నచిత్రం సానికాయిధ‌మ్‌. ఈ సినిమాకి అరుణ్ ‌మహేశ్వ‌ర‌న్ దర్శకత్వం వహిస్తున్నాడు.క్రైం డ్రామా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. అయితే తాజాగా మరో లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్.. ఇందులో కీర్తిసురేశ్, సెల్వ రాఘ‌వ‌న్ డీగ్లామ‌రైజ్డ్ లుక్ లో కనిపిస్తూ కాస్త భ‌య‌ప‌డుతున్న‌ట్టుగా ఉన్నారు. ఈ లుక్ మొత్తం సినిమా పైనే అంచనాలను పెంచేసింది.

ఈ సినిమాతో పాటుగా మ‌రికొన్ని ప్రాజెక్టుల‌ను కూడా లైన్ లో పెట్టింది కీర్తి సురేష్.. మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ చిత్రాలు మహిళ ప్రాధాన్యం ఉన్న చిత్రాలుగా తెరకెక్కుతున్నాయి. ఇక అటు నితిన్ తో చేస్తున్న రంగ్ దే చిత్రం చివరి దశకు చేరుకుంది. అంతేకాకుండా మహేష్ బాబు హీరోగా వస్తున్న సర్కారు వారి పాట అనే చిత్రంలో కూడా కీర్తి నటిస్తోంది. మరోవైపు తమిళంలో రజనీకాంత్, శివ కాంబినేషన్‌లో వస్తున్న మరో సినిమాలో కూడా కీర్తి కీలక రోల్‌లో కనిపించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories