'మహానటి' తో 'కబాలి'..?

సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించేందుకు హీరోయిన్లు కొదవ ఉంది అని తెలిసిన విషయమే. గతకొంతకాలంగా సీనియర్ హీరోయిన్ల తోనే నటిస్తున్నారు రజిని.

Ruthvik
Updated on: 16 Jan 2019 3:26 PM IST
మహానటి తో కబాలి..?
X

సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించేందుకు హీరోయిన్లు కొదవ ఉంది అని తెలిసిన విషయమే. గతకొంతకాలంగా సీనియర్ హీరోయిన్ల తోనే నటిస్తున్నారు రజిని. లేడి సూపర్ స్టార్ నయనతార, హ్యూమా ఖురేషి, ఈమధ్యనే 'పేట' లో సీనియర్ బ్యూటీ సిమ్రాన్, చెన్నై చిన్నది త్రిష తో నటించారు. కానీ తాజాగా రజనీకాంత్ ఒక యువ హీరోయిన్ తో జాతకట్టనున్నారు అనే వార్త సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది. రజినీకాంత్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. సినిమా కాస్టింగ్ పనులతో మురుగదాస్ బిజీగా వున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రజినీ సరసన హీరోయిన్ గా మురుగదాస్ కీర్తి సురేష్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలవ్వనుంది. తన కూతుళ్ల కంటే దాదాపు పదేళ్లు చిన్నదైన కీర్తి సురేష్ తో రజినీకాంత్ రొమాన్స్ ఏంటని కొందరు పెదవి విరుస్తున్నారు కానీ మురగదాస్ మాత్రం ఈ కాంబో తప్పకుండా తెరకెక్కలని అనుకుంటున్నారు.

Ruthvik

Ruthvik

Next Story