మొన్న అనసూయ, నేడు కస్తూరి..
కరోనా ప్రభావం అన్ని రంగాలపైన పడింది. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీలు కూడా ఎదురుకుంటున్నారు.
కరోనా ప్రభావం అన్ని రంగాలపైన పడింది. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీలు కూడా ఎదురుకుంటున్నారు. ఇక సినీరంగం విషయానికి వచ్చేసరికి సినీ కార్మికలు వరకు ఉపాధిని కోల్పోయారు. ఇక సెలబ్రిటీలు సైతం షూటింగ్ లు వాయిదా పడడంతో ఎలా ఇళ్లు ఎలా గడుస్తోంది.. అద్దె ఎలా కట్టుకోవాలి?? మా ఖరీదైన కార్లకు ఈఎంఐ ఎవరు కడతారు అంటూ పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే జబర్దస్త్ యాంకర్ అనసూయ ఇవే ప్రశ్నలు లేవనెత్తిన సంగతి తెలిసిందే..
'మేం పని చేయలేకపోతే.. మా సంపాదన ఆగిపోతుంది. మాకు నెలవారీ తప్పనిసరి ఖర్చులు ఉంటాయి. ఇంటి అద్దె, కరెంట్ బిల్స్, ఈఎంఐ తదితరాలు కట్టుకోవాలి. ఇలాంటి పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరుతున్నాను'అంటూ మంత్రి కేటీఆర్ కి ట్వీట్ చేసింది. ఈ నేపధ్యంలో నెటిజన్లు ఆమె వీపరితంగా ట్రోల్స్ చేశారు. ఇది కాస్తా అనసూయ పోలీసులకు కంప్లైట్ చేసే వరకూ వెళ్లింది.
తాజాగా ఇవే ప్రశ్నలను లేవనెత్తింది మరో నటి.. లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వారు EMIలు ఎలా కడతారంటూ, ప్రభుత్వం కనీసం ఒక నెల EMI నుంచి మినహాయింపు ఇవ్వాలని నటి కస్తూరి శంకర్ వరుస ట్వీట్స్ చేసింది. ఆర్ధిక పరమైన ఇబ్బందులు పడుతున్న కష్టమర్లకు ఆర్బీఐ అందించిన బెనిఫిట్స్ అందుతున్నాయా? వడ్డీలు, ఫీజులు, ఓవర్ డ్రాఫ్ట్స్‌లను ఇవి ప్రభావితం చేస్తాయా? EMIల పరిస్థితి ఏంటి? ఎంతైనా బ్యాంక్‌లు బ్యాంక్‌లే వాటి పని అవి చేస్తాయి. అని కస్తూరి పేర్కొంది.
అన్నమయ్య, భారతీయుడు మొదలగు చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది కస్తూరి.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సుమారు 100పైగా చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం 'ఇంటింటి గృహలక్ష్మి'సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
The relief measures RBI has rolled out to banks, will they pass down to the customers? How will this affect fees, interest and overdrafts? What about EMIs? #LaymanWorries
— Kasturi Shankar (@KasthuriShankar) April 17, 2020
#rbigovernor #ShaktikantaDas




